*పాలనకు, పాలకులకు అర్థాన్ని మార్చి, ప్రజల అభివృద్దే ఉచ్ఛ్వాస, నిశ్వాసాలుగా రాజకీయ ప్రస్థానం సాగించిన నాయకుడి అక్రమ అరెస్టుకు ఏడాది*

*రాజకీయ కక్ష సాధింపులతో దేశం గర్వించే రాజనీతిజ్ఞుడు అరెస్టు అది….!*

*దేశాన్ని నివ్వెరపరిచిన…ప్రభుత్వ టెర్రరిజం పతాకస్థాయికి చేర్చిన అరెస్టు అది….!*

*దేశం లో కోట్లమంది ప్రజల గుండెలను బరువెక్కించిన అరెస్టు అది….!*

*ప్రపంచంలో ఎన్నడూ లేనివిధంగా ఒక రాజకీయ నాయకుడి కోసం 70 దేశాల్లో ప్రజలు రోడ్డెక్కి నిరసనలు చేసిన అరెస్టు అది….!*

*నిద్రాణమై, భయకంపితులై ఉన్న ప్రజల్లో తిరుగుబాటు తీసుకువచ్చిన అరెస్టు అది….!*

*అరాచకాన్ని ప్రశ్నించేందుకు కుల, మత, ప్రాంత, వర్గ భేదం లేకుండా తెలుగు జాతి గళమెత్తిన అరెస్టు అది….!*

*ప్రజాస్వామ్యం కోసం రాజకీయ ప్రయోజనాలు వదులుకునే నేతను అప్రజాస్వామ్యకంగా చేసిన అరెస్టు అది…!*

*విధ్వంస ప్రభుత్వ పతనానికి నిశ్శబ్ద విప్లవంతో నాంది పలికిన అరెస్టు అది….!*

*చరిత్ర క్షమించని తప్పు చేసిన వారిని భూస్థాపితం చేసేందుకు అడుగు పడిన అరెస్టు అది…..!*

About The Author