సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం!
హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను హైడ్రా కూల్చివేస్తోంది. హైడ్రా తెలంగాణలోనే కాదు.. ఏపీలోనూ చర్చనీయాంశంగా మారింది. అక్రమ నిర్మాణాలను కూల్చివేయడాన్ని దాదాపుగా అందరూ స్వాగతిస్తున్నారు. హైడ్రా వంటి చట్టం తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలని పలువురు కోరుకుంటున్నారు. అయితే.. ఏపీ ప్రజలు కూడా హైడ్రాను స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం ప్రకటించారు. ఏపీలో కూడా హైడ్రా తరహా చట్టం తీసుకువస్తామని చెప్పారు.
వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగానే హైడ్రా తరహా చట్టంపై కీలక కామెంట్స్ చేశారు. బుడమేరు వాగు పొంగి.. చాలా మంది వరదలో చిక్కుకోవడానికి ఆక్రమణలే ప్రధాన కారణమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏపీలో కూడా హైడ్రా తరహా చట్టం తీసుకువచ్చి, బుడమేరు ఆక్రమణలు తొలగిస్తామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కొంతమంది ఆక్రమణల కారణంగా లక్షల మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోమని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. విజయవాడలో ఎనిమిదో రోజు కూడా బాధితులు నీటిలోనే ఉన్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వరద వల్ల పాడైపోయిన వాహనాలను బాగు చేయిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.