మరో భార్యా బాధితుడు బలి.. ‘నా అస్తికలను డ్రైనేజీలో కలపండి’
wife harassment:
భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక మోహిత్ యాదవ్ సెల్ఫీ వీడియో తీసి సూసైడ్ చేసుకున్నాడు. వరకట్న వేధింపులు కేసు పెడతామని బెదిరిస్తున్నారని వీడియోలు చెప్పాడు. తన చావుకు న్యాయం జరగకుంటే అస్తికలు డ్రైనేజీలో కలపాలని బందువులను కోరాడు.
బెంగళూరుకు చెందిన టెక్కీ అతుల్ సుభాష్ సూసైడ్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. 24 పేజీల సూసైడ్ లెటర్ రాసి.. తనకు భార్య, అత్తమామల నుంచి ఎదురైన వేధింపులను వీడియోలో చెప్పుకొని చనిపోయాడు. అలాంటి ఘటనే తాజాగా మరొటి చోటుచేసుకుంది. తన భార్య, ఆమె కుటుంబం తనను మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తోందని ఆరోపిస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు న్యాయం జరగకపోతే అస్తికలు డ్రైనేజీలో కలుపాలని చెబుతూ ఒక సెల్ఫీ వీడియో తీసి దగ్గరి బంధువుకు షేర్ చేశాడు. అందులో తన చావుకు న్యాయం జరగకపోతే అతని అస్తికలు మురికి కాలువలో కలపాలని చెప్పుకొచ్చాడు.
మోహిత్ యాదవ్ అనే వ్యక్తి సిమెంట్ కంపెనీలో ఫీల్డ్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రియ అనే యువతిని ఏడేళ్లుగా ప్రేమించాడు. పెద్దలను ఒప్పించి రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. దంపతుల మధ్య గొడవలు తలెత్తాయి. భార్య కుటుంబసభ్యులు తనను వేధింపులకు గురిచేస్తోందని, బెదిరిస్తున్నారని మోహిత్ ఒక వీడియో రికార్డు చేశాడు. ఆ వీడియోను దగ్గరి బంధువుకు షేర్ చేసి ఒక హోటల్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వరకట్న వేధింపుల కేసు పెడతామని బెదిరిస్తూ..
మోహిత్ రికార్డ్ చేసిన వీడియోలో ఇలా చెప్పుకొచ్చాడు.అతని భార్య ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా ఉద్యోగంలో చేరింది. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న ఆమెకు వాళ్ల అమ్మ అబార్షన్ చేయించింది. ఆమెపై ఉన్న బంగారు ఆభరణాలను బలవంతంగా దగ్గర పెట్టుకుంది. ఒక రూపాయి కట్నం కూడా తీసుకోలేదు. కానీ నాపై తప్పుడు కేసులు పెట్టారు. నాకు నా తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులను తన పేరిట బదిలీ చేయాలని నా భార్య కూడా తరచూ గొడవలు పెట్టుకునేది. ఈ విషయంపై ఆమె, ఆమె కుటుంబసభ్యులు నన్ను మానసికంగా చిత్రహింసలకు గురిచేశారు. వారు చెప్పినట్లు చేయకపోతే నా కుటుంబసభ్యులపై కూడా కేసులు పెడతామని బెదిరించారు’ అని మోహిత్ ఆ వీడియోలో చెప్పాడు.