సెల్ ఫోన్ శరీరంలో ఒక్క భాగం…


మమతానురాగాలు మాయ మాయె, మాయదారి సెల్లు రోగమాయే, పురిటి, పరిణయ, కర్మకాండలకు వాట్సప్లు వేదికలాయే, పక్కవారితో పలకరింపులే కరువాయే, సోషల్ మీడియాలో సోపతి లాయె. సోషల్ మీడియా స్టేటస్ లో లైకులను లెక్కలాయే, డ్యాన్సులతో రీల్స్ మాయ రూపాలాయే. కిడ్స్ ఆటపాట కేలీ కేరింతలు అడుగంటిపోయి, శారీరక శ్రమలేఖ మానసిక ప్రశాంతత కరువైపాయె, టీనేజ్ యువత మధ్యం మత్తులో ఏమి చేస్తున్నారో, ఏమి తెలియక పోయే. మధ్య వయస్కులు సంపాదన పైనే సర్వం చెమటోడ్చి కంటికి రెప్పలా చూసుకున్న సంతానం సెల్లుకు బానిసయిపోయే, బడికి పోయే బుఢతలకు భూతద్దాలు నుదుట నేత్రాలకు నేస్తాలాయే.
కమ్యూనికేషన్, సమాచార లభ్యత, వినోదం వంటి వాటికి సెల్ ఫోన్లు ఉపయోగపడతాయి. అయితే, అధిక వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు, సామాజిక ఒంటరితనం, డిజిటల్ వ్యసనం వంటి సమస్యలు వస్తాయి. అయితే మొబైల్ వలన ప్రజలకు లాభాలు ఉన్నట్టే, నష్టాలు కూడా ఉంటాయి.

*నష్టాలు: ఆరోగ్య సమస్యలు:*

సెల్ ఫోన్ల స్క్రీన్ నుండి వచ్చే లైట్ కంటి సమస్యలకు అవి కన్నులు పొడిబారడం, చూపు మందగించడం, కళ్ళు మూసినప్పుడు నీరు కారడం, ఇయర్ బర్డ్స్ 24 గంటల పాటు పాటలతో కాలక్షేపాలాయే, నిద్రలేమి, తలనొప్పి, వినికిడి లోపంతోపాటు ఒంటరి తనం వంటి సమస్యలు వస్తాయి..

*డిజిటల్ వ్యసనం లేదా మొబైల్ మానియా:*
సెల్ ఫోన్లకు అతిగా అలవాటుపడి, వాటిని చూడకుండా, లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడవచ్చు.

*సామాజిక ఒంటరితనం:* ఇంటికి చుట్టాలు వచ్చినా అన్నదమ్ములు వచ్చిన ఇరుగుపొరుగువారు ఎవరు వచ్చినా ఫోన్లో పాటలు వింటూ, ఆన్లైన్లో ఫ్రెండ్స్ తో కలిసి వీడియో గేమ్ ఆడటం
వల్లనే ముఖాముఖి సంభాషణలు తగ్గడం, స్నేహితులతో ఎక్కువ సమయం గడపకపోవడం వంటివి జరగవచ్చు.

*ఏకాగ్రత లోపం:* గృహిణులు, పిల్లలు, పెద్దవారు, వ్యాపారవేత్తలు మరియు విద్యార్థులు సెల్ ఫోన్లలో ఇతర విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి పరధ్యానమై, చదువు, పనిపై ఏకాగ్రత తగ్గవచ్చు.

*గోప్యత సమస్యలు:* సోషల్ మీడియాలో సోపతుల వల్ల వ్యక్తిగత సమాచారం దొంగతనానికి గురయ్యే ప్రమాదం ఉంది.

*మానసిక సమస్యలు:* ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో పాటు నేను ఏమి చేయలేను నాకు చావే దిక్కు అనే స్టేజీకి వచ్చే అవకాశం ఉంది.

*భద్రతా సమస్యలు:* ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలకు గురయ్యే ప్రమాదం ఉంది.

*శారీరక సమస్యలు:*
కళ్ల మంటలు, మెడ నొప్పి, చేతులు, వేళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి వంటి సమస్యల తో పాటు ఊబకాయం,
డయాబెటిస్ రావచ్చు.

*కుటుంబ సమస్యలు:* మొబైల్ ఫోన్లు వ్యక్తుల జీవితాలపై ఎక్కువ ప్రభావం చూపుతాయని అర్ధం అవుతుంది.

సెల్ ఫోన్లను నేను తెలివిగా ఉపయోగించడం చేస్తున్నాను అనుకొని వారు అనుకోని సంబంధాలు ఏర్పరచుకొని అనారోగ్య కరమైన అలవాట్లను పాటించడం ద్వారా నేరాలు, గోరాలు
జరగవచ్చు.

*లాభాలు:* *సులభమైన కమ్యూనికేషన్:*
సెల్ ఫోన్ల ద్వారా ఎక్కడ ఉన్నా విద్య, వ్యాపారం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో త్వరగా సంభాషించవచ్చు. సమాచార లభ్యత మనకు కావలసినవి సెల్ ఫోన్ మరియు ఇంటర్నెట్ ద్వారా క్షణాల్లో సమాచారం, వార్తలు ఇతర విషయాలు తెలుసుకోవచ్చు.

*వినోదం:*
పాటలు వినడం, సినిమాలు చూడటం, గేమ్స్ ఆడటం
వంటి వినోదానికి సెల్ ఫోన్లు ఉపయోగపడతాయి.

*ఆర్థిక లావాదేవీలు:*
ఫోన్ పే, జీ పే, యూపీఐ మరియు ఇతర ఆన్లైన్ బ్యాంకింగ్, పేమెంట్ యాప్ల ద్వారా సులభంగా డబ్బు పంపడం, తీసుకోవడం చేయవచ్చు.

*విద్యాసంబంధిత ప్రయోజనాలు:*
ఆన్లైన్ చదువులు, విద్యా
సంబంధిత సమాచారం పొందడానికి సెల్ ఫోన్ ఆధారంగా ఇంటర్నెట్ పనిచేసే పరికరాలతో ఆన్ లైన్ విద్య సులభంగా నేర్చుకోవచ్చు. ఆయా పరికరాలు ఉపాద్యాయులను తెరపై చూపుతుంది. బోధన కొనసాగిస్తుండగానే, బోధించేవారిని ఇంటర్నెట్ ఆధారిత పరికరాలలో ఎంచుకోవచ్చు,

మన సమాజం వేగవతంగా డిజిటలైజ్ అవుతుంది. అందులో భాగంగా స్మార్ట్ ఫోన్ శరీరంలో ఒక భాగమైపోయింది.

*ముగింపు:*
ఇటీవలి కాలంలో ప్రపంచంలో మొబైల్ ఫోన్లు బాగా వృద్ధి చెందాయి. ప్రజలంతా మొబైల్ ద్వారా సంప్రదింపులు
జరుపుకుంటున్నారు.
ఏదైనా ఒక వస్తువుని ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఉపయోగిస్తే, ఆ వస్తువు అతనికి ఉపకారిగా మారుతుంది. అదే వస్తువుతో ఎక్కువసేపు గడిపితే, ఆ వస్తువు అతనికి లాభం కన్నా నష్టం ఎక్కువ చేస్తుంది.

సెల్ ఫోన్లు చిన్నలకు పెద్దలకు వృద్ధులకు మరియు విద్యార్థులకు ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, వాటిని అతిగా వాడటం వల్ల ప్రతికూల ప్రభావాలు కూడా ఉన్నాయి. విద్యార్థులు సెల్ ఫోన్లను సమతుల్యంగా ఉపయోగించడం నేర్చుకోవాలి మరియు వారి చదువు మరియు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మరియు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులకు సెల్ ఫోన్లను సమతుల్యంగా ఉపయోగించడం నేర్పించాలి. అలాగే వారి చదువు మరియు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మరి ఏమైనా సమస్యలు ఉన్నా సైకలాజికల్ కౌన్సిలర్ ని సంప్రదించండి.

About The Author