70mm సినిమా స్కోప్ కి సిద్ధంగా ఉండండి…
70mm సినిమా స్కోప్ కి సిద్ధంగా ఉండండి…
ట్రంప్ టారిఫ్ లు, భారత్ నిర్ణయాలు: ఢిల్లీ వైపు చూస్తున్న యవత్ ప్రపంచం
********************************************
ట్రంప్ టారిఫ్ ల చదరంగం మొదలెడితే చెక్ పెడుతూ భారత్ ను బలోపేతం చేస్తున్న మోడి. సంక్షోభాలనే అవకాశాలుగా మలచి ప్రపంచ అగ్రగామిగా నిలబెట్టడం మోడీ జీ విజయం సాదిస్తే… ఇంటా బయటా చివాట్లు టింటున్న ట్రంప్…
అభివృద్ధి చెందుతున్న దేశమైన భారతదేశంపై బలవంతంగా విధించిన 50% సుంకం గురించి మనం ఏ కోశానా ఆందోళన చెందడం లేదు. భారత ప్రజలు నాలుగు సంవత్సరాలు ట్రంప్ స్నేహాన్ని చూశారు. మరో నాలుగు సంవత్సరాలలో ఆ స్నేహం మరింత పెరుగుతుందని భావించారు. కానీ ట్రంప్ అహంకారం భారతదేశానికి అమెరికాని బలవంతంగా శత్రువుని చేసింది.
ట్రంప్ కు స్వదేశంలో పెరుగుతున్న వ్యతిరేకత:
భారతదేశం పట్ల ఆయన దూకుడు, అధిక సుంకాల విధానం పై ఇప్పుడు ఆర్థికవేత్తల విమర్శలు మాత్రమే కాకుండా, మన సొంత వ్యక్తులే మనల్ని మోసం చేశారు అంటూ అమెరికన్లు వ్యంగ్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని విమర్శిస్తున్నారు. ఒకడు అల్జీమర్స్ అంటూ, మరొకడు బ్రెయిన్ డెడ్ అంటూ, సైకో, రెండు నాల్కల వ్యక్తి అంటూ ట్రంప్ పై విసుర్లు విసురుతున్నారు. అమెరికాలోనే రాజకీయ వ్యతిరేకత పెరిగిపోయింది. యుఎస్ కాంగ్రెస్ సభ్యులు, ముఖ్యంగా హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ సభ్యులు, ట్రంప్ విధానాన్ని బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు.
డెమొక్రాట్లు కొంతమంది రిపబ్లికన్లు కూడా, ఈ అధిక సుంకాలు అమెరికా భారతదేశ సంబంధాలను దెబ్బతీస్తున్నాయని మాత్రమే కాకుండా, రోజువారీ వస్తువులు మరింత ఖరీదైనవిగా మారాయి, ఆర్దికంగా అమెరికన్ పౌరులను కూడా నేరుగా దెబ్బతీస్తున్నాయని విచారిస్తున్నారు. ఈ చర్య గందరగోళం సృష్టిస్తుందని వాపోతున్నారు. ఈ టారిఫ్ ల యుద్ధం ట్రంప్ పేర్కొన్నట్లుగా ఉక్రెయిన్ గురించి కూడా కాకపోవచ్చని, పాకిస్తాన్ భారత్ ల మధ్యవర్తిత్వానికి భారత్ సహకరించక పోవడము మరియు తమ వ్యవసాయ, పాల ఉత్పత్తులను భారర్ మార్కెట్ లోకి అంగీకరించకపోవడం వలనే ట్రంప్ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ట్రంప్ అధిక సుంకాల విధానాలను 61% కంటే ఎక్కువ మంది అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారని ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే వెల్లడించింది. ఈ అసంతృప్తి అనేక రాష్ట్రాల్లో ట్రంప్ మెజారిటీ అభిమాన రాష్ట్రాలలో కూడా బలహీనపరుస్తూ, ప్రతిపక్షాలు గోలపెడుతున్నాయి.
అమెరికా యుద్ధ చరిత్ర:
అమెరికాకి నిజంగా యుద్ధం గెలిచిన చరిత్రలేదనే చెప్పాలి. వియత్నాంపై (1965–73 లో ) 8 ఏళ్లపాటు చేసిన ప్రయత్నం చివరికి నిరాశతో ముగిసింది. అదే కథ ఆఫ్ఘనిస్తాన్ (2001–21)లో మరో 20 ఏళ్లపాటు మళ్లీ రిపీట్ అయింది. శత్రువును ఓడించేందుకు వెళ్లిన అమెరికా చివరికి అదే శత్రువుకు అధికారాన్ని అప్పగించింది. యుద్ధ విఫలతల ఘనత అమెరికాకు చాలా భారంగా మారింది. 1973లో అప్పు $458 బిలియన్ మాత్రమే ఉండగా, 2021 నాటికి అది $28 ట్రిలియన్కి పెరిగింది. ఇప్పుడు, ఆగస్టు 2025లో, అప్పు $37 ట్రిలియన్ దాటింది. యుద్ధాలతో శక్తిని చూపించాలనుకున్న అమెరికా, వాస్తవానికి తన ఆర్థిక బలహీనతను మాత్రమే బయటపెట్టుకుంది.
భారతదేశ వ్యాపారం ద్వారా అమెరికాకి ఎదురుదెబ్బలు:
ట్రంప్ రాజకీయ ఎదురుదెబ్బలతో పోరాడుతుండగా, భారత వ్యాపార దిగ్గజాలు బలమైన ప్రతిఘటనను పంపారు . రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ గతంలో US మరియు యూరోపియన్ ఆంక్షల లక్ష్యంగా పెట్టుకున్నాయి. దిగుమతులను తగ్గించే బదులు, రష్యన్ చమురు దిగుమతులను 10–20% పెంచుతామని, సెప్టెంబర్ నుండి రోజుకు 1.5 లక్షల నుండి దాదాపు 3 లక్షల బ్యారెళ్లకు పెంచుతామని ప్రకటించాయి. చౌకైన ఇంధన సరఫరాలను పొందడం తమ ఇష్టమని, సొంత దేశ ప్రయోజనాలే ముఖ్యమని అమెరికా మరియు బ్రస్సెల్స్ రెండింటికీ భారతదేశం పాశ్చాత్య ఆర్థిక ఒత్తిడికి తలొగ్గదని తేల్చి చెప్పాయి.
జపాన్‌లో మోడీ దౌత్యపరమైన మాస్టర్‌స్ట్రోక్:
దౌత్యపరంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జపాన్ పర్యటన ట్రంప్ వ్యూహానికి మరో దెబ్బ కొట్టింది. టోక్యోలో మాట్లాడుతూ, ట్రంప్ గతంలో భారతదేశాన్ని “చనిపోయిన ఆర్థిక వ్యవస్థ”గా కొట్టిపారేయడాన్ని మోడీ ఖండించారు, బదులుగా 80% కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటున్నాయని మరియు 75% కంపెనీలు ఇప్పటికే ఇక్కడ లాభదాయకంగా ఉన్నాయని గర్వంగా చెప్పారు. భారతదేశం కేవలం మూలధనాన్ని పెంచుకోవడం మాత్రమే కాదు దానిని గుణిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. రాజకీయ స్థిరత్వం, ఆర్థిక సంస్కరణలు మరియు పారదర్శకతతో, భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి సిద్ధంగా ఉంది.
జపాన్ అద్భుతమైన ఆమోదంతో ప్రతిస్పందిస్తూ, భారతదేశంలో $68 బిలియన్ల పెట్టుబడి ప్రణాళికను ప్రకటించింది. జపాన్ తన భారతదేశ నిబద్ధతను రెట్టింపు చేస్తూ, ఉన్నత స్థాయి US వాణిజ్య రాయబారి పర్యటనను రద్దు చేసింది. వాషింగ్టన్‌తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న దేశాలలో ఇది సందేహాలను రేకెత్తిస్తుంది, ఆసియాలో మారుతున్న ప్రాధాన్యతల గురించి స్పష్టమైన సందేశాన్ని పంపింది. స్వావలంబన మరియు దేశీయ వినియోగంపై దృష్టి సారించి అమెరికా సుంకాల ఒత్తిడిని ప్రతిఘటించిన భారతదేశ ఉదాహరణ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతోంది.
అలాగే భారతదేశఎక్కడ తగ్గకుండా తన ఆత్మ గౌరవంతో ముందుకు వెళుతుంది. అమెరికా సుంకం విధించని జనరిక్ మందులతో నిండిన ఓడలను భారతదేశం ఆస్ట్రేలియాకు పంపింది. ఆస్ట్రేలియా చాలా కాలంగా జనరిక్ మందులను కావాలని అడుగుతోంది. అమెరికాకు అవసరమైన జనరిక్ మందుల లో 60% భారతదేశం సరఫరా చేస్తుంది. అందుకనే ఇప్పటి వరకు ఆస్ట్రేలియా కు పంపలేదు ఇప్పుడు మన ఓడ మార్గం మళ్లింది.
వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి:
భారతదేశం తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని ప్రకటిస్తుంది. అమెరికన్ సుంకాలు లేదా యూరోపియన్ ఆంక్షలు భారతదేశ ఆర్థిక, విదేశాంగ విధాన ఎంపికలను నిర్దేశించలేవు. రష్యా, జపాన్ మరియు ఆస్ట్రేలియాల తో సంబంధాలను ఏకకాలంలో బలోపేతం చేసుకోవడం ద్వారా, భారతదేశం తన తటస్థ విధానం సజీవంగా, బలంగా ఉందని నిరూపిస్తోంది.
ట్రంప్‌కు ఇంతకంటే దారుణమైన అవమానం ఉండదు :
ప్రపంచంలో నిజమైన స్నేహితుల కొరత చాలా ఎక్కువగా ఉన్న ఈ సమయంలో, భారతదేశం వంటి మంచి మిత్రుడ్ని కోల్పోవడం ట్రంప్ జీవితంలో అతిపెద్ద తప్పుగా అమెరికన్లు చెబుతున్నారు. స్వదేశంలో పెరుగుతున్న వ్యతిరేకత, భారతదేశ కార్పొరేట్ దిగ్గజాల ప్రతిఘటన మరియు టోక్యోలో దౌత్యపరమైన నిర్లక్ష్యం. ఇవన్నీ ఒకటి తెలియజేస్తున్నాయి, నిర్ణయాలు వైట్ హౌస్ లో తీసుకోబడవు, ఢిల్లో మాత్రమే తీసుకోబడతాయి...