వల్లూరు జయప్రకాష్…‌ బిజెపి రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి,


నరేంద్ర మోదీ ప్రభుత్వం జీఎస్టీని సులభతరం చేస్తూ, పేద, రైతు, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకుంది.
 నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల సంక్షేమమే ధ్యేయంగా తీసుకుని ముందుకెళ్తోంది. తాజాగా జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వల్ల ప్రతీ పేద, మధ్యతరగతి కుటుంబానికి నేరుగా లాభం చేకూరబోతోంది.
 దినసరి అవసరాల వస్తువులు, గృహ వినియోగ వస్తువులపై ధరలు తగ్గడం వల్ల జీవన వ్యయం గణనీయంగా తగ్గనుంది. పండుగల సమయంలో పేద కుటుంబాలకు ఇది నిజమైన బహుమతి.
 కాంగ్రెస్ పాలనలో పెరిగిన ధరలు, పెరిగిన పన్నుల భారం వల్ల ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు మోదీ గారి జీఎస్టీ సంస్కరణలు ఊరట కలిగిస్తున్నాయి. ఇది కేవలం ఆర్థిక ఉపశమనం మాత్రమే కాదు, పేదల అభ్యున్నతి పట్ల మోదీ ప్రభుత్వ నిబద్ధతకు నిలువుటద్దం లాంటిది.
 దసరా – దీపావళి పండుగకు ముందే పేదలకు మోదీ గారి గిఫ్ట్. పండుగలో పేద కుటుంబాలు కూడా సంతోషంగా కొనుగోలు చేయగలిగేలా..నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తోంది. పేద కుటుంబాల రోజువారీ ఖర్చులు తగ్గించడమే లక్ష్యం.
 ఇంటి అవసరమైన నూనె, పేస్టు, సబ్బు, షాంపూ, బేబీ డైపర్స్.. ఇలా అన్నీ 18% నుంచి కేవలం 5%కి తగ్గించింది.
 రోజువారీ అవసరాలపై భారీ ఉపశమనం లభించనుంది.
 హెయిర్ ఆయిల్, షాంపూ, పేస్ట్, సబ్బు, షేవింగ్ క్రీమ్ వంటి వాటిపై GST 18% నుంచి కేవలం 5%కి తగ్గింది.
 వెన్న, పన్నీర్, రెడీమేడ్ నమ్‌కీన్స్, బిస్కెట్లు— అన్నీ ఇప్పుడు తక్కువ ధరలకు అందుబాటులో.
 బేబీ ఫీడింగ్ బాటిల్స్, నాప్‌కిన్స్, డైపర్స్— ఇవన్నీ 12% నుంచి 5%కి తగ్గించబడింది
 పేదల జేబులో డబ్బు మిగిలి, గృహజీవనం సులభంగా మారనుంది.
 సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చే నూతన GST రిఫార్మ్స్
 దసరా- దీపావళి పండుగలకు ప్రధాని నరేంద్ర మోదీ గారి గిఫ్ట్ ఇది.
 పండగలో మిఠాయిలు, బట్టలు, వాహనాలు, ఎలక్ట్రానిక్స్— ఇవన్నీ ఇక మరింత చౌకగా.

 మోదీ గారి నిజాయితీ గల పాలన వల్లే ఇది సాధ్యం. మహిళలు, రైతులు, విద్యార్థులు, వ్యాపారులు – అందరికీ లాభం.
 . ఆరోగ్యరంగానికి భారీ ఊరట ..ఆరోగ్య రంగంలో పేదలకు పెద్ద ఊరట – థర్మామీటర్, ఆక్సిజన్, టెస్టులు, కళ్లద్దాలు—ఇలా ఇప్పుడు అన్నీ చాలా చౌక ధరలకే లభించనున్నాయి.
 ఆరోగ్యం పేదలకు భారంగా కాకుండా ఆశీర్వాదం అవుతుంది.
 హెల్త్ & లైఫ్ ఇన్స్యూరెన్స్ పై GST 18% నుంచి NILకి తగ్గింది.
 థర్మామీటర్, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నస్టిక్ కిట్స్—ఇవన్నీ 18% నుంచి 5% తగ్గించారు.
 గ్లూకోమీటర్లు, టెస్ట్ స్ట్రిప్స్, కళ్ళజోడులు—అన్నీ 12% నుంచి 5%కి.
 రైతులకు ఎల్లప్పుడూ అండగా నిలిచేది మోదీ ప్రభుత్వమే. రైతు స్నేహి నిర్ణయాలు నిర్ణయం తీసుకోవడం, రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా అనేక సంక్షేమ పథకాలు, చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది.
 ఇప్పుడు వ్యవసాయ యంత్రాలు, కోత, విత్తనాల పరికరాలు—ఇవన్నీ 12% నుంచి 5%కి తగించింది.
 రైతు ఖర్చులు తగ్గి ఉత్పత్తి పెరిగేలా మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
 ట్రాక్టర్ టైర్లు, బయో-పెస్టిసైడ్స్, డ్రిప్ ఇరిగేషన్— ఇవన్నీ 18% నుంచి 5%కి తగ్గాయి.
 పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించే మోదీ ప్రభుత్వ సంకల్పం.
 విద్యార్థులకు గిఫ్ట్ – మ్యాప్స్, పుస్తకాలు, నోట్‌బుక్స్, పెన్సిల్స్, ఎరాజర్లు.. ఇటువంటివన్నింటిపై GST మినహాయింపు.
 మోదీ ప్రభుత్వo విద్య అందరికీ సులభంగా అందేలా అనేక రకాల చర్యలు తీసుకుంటోంది.
 మ్యాప్స్, చార్ట్స్, గ్లోబ్స్, నోటుబుక్స్, పెన్సిల్స్— పన్ను పూర్తిగా NIL!
 విద్యార్థులపై భారమయ్యే పన్నులు తగ్గించి, విద్య ఖర్చులు తక్కువ చేయబడింది.
 మధ్యతరగతి కుటుంబాల కలల వాహనాలు ఇప్పుడు మరింత అందుబాటులో ఉండేలా.. సామాన్యుడి కలల వాహనాలు ఇక మరింత తక్కువ ధరకు లభించనున్నాయి.
 పెట్రోల్, డీజిల్ హైబ్రిడ్ కార్లపై GST 28% నుంచి 18%కి తగ్గింది.
 త్రిచక్ర వాహనాలు, బైకులు, సరుకు వాహనాలు—ఇవన్నీ 28% నుంచి 18%కి తగ్గించింది.
 ఎలక్ట్రానిక్స్ మరింత చౌకగా లభించనున్నాయి.

 ఏసీలు, టీవీలు, మానిటర్లు, ప్రొజెక్టర్లు, డిష్ వాషింగ్ మెషిన్లు—all 28% నుంచి 18%కి తగ్గించబడ్డాయి.
 ఇంటి సదుపాయాలు తక్కువ ధరలో అందేలా మోదీ ప్రభుత్వం మార్పులు చేసింది.
 ప్రాసెస్ రిఫార్మ్స్ – MSMEs కి పెద్ద వరం లాంటిది. ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ 3 రోజుల్లో. సులభమైన రీఫండ్ సిస్టమ్, జీరో రేటెడ్ సప్లైలు. చిన్న వ్యాపారాలు, MSMEs కి భారీగా ప్రయోజనం జరగనుంది.
 మోదీ పాలనలో ఉపశమనం – అభివృద్ధి. కాంగ్రెస్ పాలనలో పన్నుల భారం – వెనుకబడిన తెలంగాణ.
 నీతి గల, నిజాయితీ గల మోదీ ప్రభుత్వంలో సామాన్య ప్రజలపై పన్నుల భారం తగ్గింది. కేంద్రమంతటా వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా నిర్ణయాలు తీసుకున్నారు.
 దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు, రోడ్లు, రైల్వేలు, ఎయిర్‌పోర్టులు, డిజిటల్ సదుపాయాల్లో వేగంగా అభివృద్ధి జరిగింది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి.
 కాంగ్రెస్ పాలనలో భారమైన పన్నులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అటు తెలంగాణలోనూ, ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ ప్రజలపై ట్యాక్స్‌లు విపరీతంగా వేస్తున్నారు. విద్యుత్ చార్జీలు పెంపు, ఇంధన ధరలు పెంపు, మద్యం ధరలు పెంపు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు, బస్సు చార్జీలు పెంపు—ఇలా అన్నీ సామాన్యుడి జీవితాన్ని మరింత కష్టతరం చేస్తున్నాయి.
 ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. పెట్టుబడులు రావడం లేదు, పరిశ్రమలు కుదేలవుతున్నాయి, రైతులు–ఉద్యోగులు నిరాశ చెందుతున్నారు.
 ముఖ్యమైన తగ్గింపులు
 సిమెంట్ → 28% నుండి 18%
 స్మాల్ కార్లు (Petrol/LPG/CNG ≤1200cc, Diesel ≤1500cc) → 28% నుండి 18%
 3 వీలర్ → 28% నుండి 18%
 బస్సులు (10 మందికంటే ఎక్కువ సీట్స్ ఉన్నవి) → 28% నుండి 18%
 అంబులెన్స్ వాహనాలు → 28% నుండి 18%
 లారీలు/ట్రక్కులు → 28% నుండి 18%
 ట్రాక్టర్లు (≤1800 cc) → 5%
 మోటార్ సైకిళ్లు ≤350cc → 28% నుండి 18%
 సైకిళ్లు & పార్ట్స్ → 12% నుండి 5%
 అగ్రికల్చర్ మెషినరీ (Sprinklers, Harvesters etc.) → 12% నుండి 5%
 పునరుత్పత్తి శక్తి పరికరాలు (Solar, Wind etc.) → 12% నుండి 5%
 UHT పాల → పూర్తిగా GST మినహాయింపు
 ప్లాంట్ బేస్డ్ మిల్క్, సోయా మిల్క్ → 18%/12% నుండి 5%
 మెడికల్ డివైసెస్ → 12% నుండి 5%
 మెడిసిన్స్ → అన్ని డ్రగ్స్/ఔషధాలు 5% (ఇప్పటివరకూ 12% ఉన్నవి కూడా తగ్గింపు)
 టాయిలెట్ సబ్బు బార్ → 12%/18% నుండి 5%
 ఫేస్ పౌడర్, షాంపూ, షేవింగ్ క్రీమ్ → 18% నుండి 5%
 డెంటల్ హైజీన్ ప్రోడక్ట్స్ (టూత్‌పేస్ట్, టూత్‌బ్రష్, డెంటల్ ఫ్లాస్) → 5%

1. నరేంద్ర మోడీ నాయకత్వంలో యన్డీఎ ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరాలు అయ్యింది
2. ప్రజల కోసం, దేశం‌కోసం అనేక సంస్కరణలు తెచ్చారు
3. ఒకే దేశం, ఒకే పన్ను పేరుతో జి.యస్.టి ని అమల్లోకి తెచ్చారు
4. ఎనిమిదేళ్ల‌ కాలంలో 11లక్షల నుంచి 22లక్షల‌కోట్ల ఆదాయం పెరిగింది
5. నిన్న నిర్మలా సీతారామన్ ప్రకటించిన జియస్టీ సామాన్య ప్రజలకు మేలు చేసేలా ఉంది
6. ఎర్రకోట నుంచి మోడి ఇచ్చిన మాట ను నేడు నిల బెట్టుకున్నారు
7. పేద, మధ్యతరగతి ప్రజలు, రైతులకు ఈ కొత్త జీయస్టీ వల్ల మంచి‌ జరుగుతుంది
8. మనం ప్రతి రోజూ వినియోగించే అన్ని రకాల వస్తువులు ధరలు తగ్గించారు
9. జీయస్టీ లో 18శాతం నుంచి ఐదు శాతం కు మార్చారు
10. లగ్జరీ గా పరిగణించే వాటి ని మాత్రమే తగ్గించలేదు
11. ప్రభుత్వం విధానాల వల్ల సామాన్య ప్రజల కు కొనుగోలు శక్తి పెరుగుతుంది
12. పన్నులు తగ్గించడం ద్వారా ఆదాయాన్ని ఇతర అవసరాలకు ఉపయోగించే అవకాశం ఉంటుంది
13. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పన్నులు ఈ స్థాయిలో తగ్గించడం గతంలో ఎప్పుడూ లేదు
14. భవిష్యత్తు తరాలుకు ఉపయోగ పడే జీయస్టీ గా దీనిని పరిగణించాలి
15. గతంలో వ్యాట్ అమల్లో ఉండగా కేంద్రం, రాష్ట్రం వేర్వేరుగా వసూలు చేసేవారు
16. ఒకే దేశం ఒకే పన్ను విధానం‌ వల్ల ప్రజలకు భారం తగ్గింది
17. విద్యార్థులు కు ఉపయోగపడే అన్ని వస్తువులు ఐదు శాతం పన్ను విధానంలోకి తెచ్చారు
18. దసరా, దీపావళి ని మోడీ ఈసారి ప్రజలకు ముందే అందించారు
19. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ల్లో పన్ను లేకుండా చేశారు
20. రైతులు వాడే పని ముట్లు, ఇతర వ్యవసాయాధారిత వస్తువులు కు పన్ను తగ్గించారు
21. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, చిన్న కార్లు ధరలు తగ్గేలా చర్యలు తీసుకున్నారు
22. జీయస్టీ తగ్గింపు ద్వారా సామాన్య ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది
23. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టారు

About The Author