బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌కు శాసన సభలో ఘోర అవమానం


రేవంత్ రెడ్డి కోసం కేటాయించామని, లిఫ్టు ఎక్కేందుకు అనుమతి ఇవ్వని సెక్యూరిటీ.. అదే లిఫ్టులో పొంగులేటికి అనుమతి

హైదరాబాద్ – మంత్రి వర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు అసెంబ్లీకి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్

అసెంబ్లీ ఆవరణలో లిఫ్టు ఎక్కే ప్రయత్నం చేయగా, ఇది సీఎం కోసం కేటాయించిన లిఫ్టు వేరే దాంట్లో వెళ్లండని చెప్పిన సెక్యూరిటీ సిబ్బంది

వేరే లిఫ్టులో వెళ్లిపోయిన అనంతరం, అదే లిఫ్టులో పొంగులేటి రావడం చూసి షాకైన మంత్రి పొన్నం ప్రభాకర్

దీంతో కిందకి వెళ్లి నన్ను వద్దన్న లిఫ్టులో పొంగులేటికి ఎలా అనుమతి ఇచ్చారని, ఇద్దరం సమాన హోదాలోనే ఉన్నామని సెక్యూరిటీ సిబ్బందిపై మండిపడ్డ మంత్రి పొన్నం

బీసీ మంత్రి కాబట్టే వివక్ష చూపుతున్నారని వ్యాఖ్యలు చేసిన అక్కడున్న పలువురు వ్యక్తులు, మీడియా ప్రతినిధులు

About The Author