నందిగామ నియోజకవర్గంలో యూరియా కొరత లేదు :అగ్రికల్చర్ డైరెక్టర్…
రైతులు యూరియా కోసం ఆందోళన చెందనవసరం లేదని…
ప్రస్తుతం నందిగామ నియోజకవర్గంలో సుమారు 235 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు…
కంచికచర్ల మండలం 65, వీరులపాడు మండలం 45, చందర్లపాడు 60, నందిగామ 65 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయి…
ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎరువులకు అంతరాయం లేకుండా సరఫరా కొన సాగుతుందన్నారు…
యూరియా కావాల్సిన ప్రతి రైతు ప్రాథమిక సహకార సంఘం కార్యాలయాల దగ్గర యూరియా తీసుకోవచ్చు అని అధికారులు తెలిపారు…
అసత్య ప్రచారాలను రైతులు నమ్మాల్సిన అవసరం లేదని…
యూరియా కావాల్సిన రైతులు…. ప్రాథమిక సహకార సంఘాల వద్ద తీసుకోవచ్చు అని బహిరంగంగా ప్రకటించారు అధికారులు…