నాడు పంట కాలువల్లో పూడిక తీయని వైసిపి..
నాడు పంట కాలువల్లో పూడిక తీయని వైసిపి.. ఇప్పుడు రైతుల సంక్షేమం గురించి మాట్లాడితే నమ్మాలా.?
– అధికారంలో ఉన్న ఐదేళ్లలో కనీసం పొలంలో అడుగుపెట్టిన జగన్ రైతుల కష్టాలు అంటూ డ్రామాలు మొదలుపెట్టారు.
– ప్రస్తుతం రాష్ట్రంలో 80,000 మెట్రిక్ టన్నుల ఎరువుల నిలువలు అందుబాటులో ఉన్నాయి.
– త్వరలోనే 30 వేల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తుంది.
– రైతులకు 45 కేజీల యూరియా బస్తా కేవలం 250 రూపాయలకే అందుతుంది.
– అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి విడతలోనే 3200 కోట్లు రైతులకు అందించారు.
– షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు.
నాడు పంట కాలువల్లో పూడిక తీయని వైసిపి ఇప్పుడు రైతుల సంక్షేమం గురించి మాట్లాడితే రైతులు నమ్మాలా అని ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అన్నారు. రాష్ట్రంలో ఎరువుల విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలిసేలా అబ్దుల్ అజీజ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఎరువుల సరఫరా విషయంలో సమస్యను గుర్తించిన ప్రభుత్వం తొలి రోజు నుంచే పరిష్కారం కోసం ప్రయత్నం చ