నేపాల్ లో ఆందోళన కారులు తమ నిరసన గుర్తులు..
నేపాల్ లో ఆందోళన కారులు తమ నిరసన తెలియచేయడానికి నేపాల్ కి గర్వకారణ మైన విదేశీ టూరిస్టులను ఆకర్షించే 172 గదుల హిల్టన్ హోటల్ ని తగలెట్టేశారు.
ఇది సుమారు ₹800 కోట్ల ఖర్చుతో 2016 లో నిర్మాణం మొదలుపెట్టి 2024లో పూర్తి చేసి వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించారు.
ఇది నిర్మిస్తున్న 6 సం. ల కాలం లోనూ, పూర్తి అయ్యి వాణిజ్య కార్యకలాపాలు జరుగుతున్న గత సం. కాలం లోనూ దీని వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వందల మందికి ఉపాధి లభించింది. ఇది నేపాల్ టూరిజం పరిశ్రమను బలోపేతం చేసింది.
పెట్టుబాడీ దారి హోటల్ ని తగలెట్టేశారు. మంచిదే. మరి దీనివల్ల రోడ్డున పడేది ఎవరు?
రేపటి నుండి మళ్ళీ ఇది పునరుద్ధరణ జరిగి కార్యకలాపాలు మొదలయ్యే వరకు రోడ్డున పడే దాని ఉద్యోగులను ఈ నిరసన కారులు కానీ వారిని రెచ్చగొట్టిన వారు కానీ ఆదుకుంటారా?
“తుంటికి కొడితే పళ్ళు రాలిన” సామెత లాగా ఈ హోటల్ తగలెట్టడం మన దేశానికి పరోక్షంగా ₹500కోట్లు నష్టం. ఎందుకంటే ఈ హోటల్ ని వాళ్ళు ₹600కొట్లు కి మన భారత ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థ ఓరియంటల్ ఇన్సూరెన్స్ ద్వారా ఇన్సూరెన్స్ చేయించారు. అంటే మన ఇన్సూరెన్స్ సంస్థ సుమారు ₹500కోట్లు వరకు నష్టం భరించాలి.
తెలిసో తెలియకో అటువంటి అల్లర్లు దహనాలు మన దేశంలో కూడా జరగాలని కొందరు బాహాటంగా కోరుకుంటూ ఉంటే కొందరు లోలోపల కోరుకుంటున్నారు.
అల్లర్లు అంటూ మొదలైతే నీకు నచ్చని వాడి ఆస్తులే కాదు నీ ఆస్తులూ, నీ బంధువుల, శ్రేయోభిలాషుల ఆస్తులు మరియు నీకు ఉద్యోగం ఇచ్చి తిండి పెడుతున్న నీ సంస్థ ఆస్తులు కూడా ధ్వంసం అయి రోడ్డు మీద పడే అవకాశం ఉంది.
మన హై టెక్ సిటి లేదా గచ్చిబౌలి లేదా ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లో హిల్టన్ వంటి బోలెడు అద్దాలు మేడలు ఉన్నాయి. అవి ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి చూపిస్తున్నాయి. దాన్లో నువ్వు ఉండవచ్చు.
అందుకని నాశనం అయిపోవాలని ధ్వంసం అయిపోవాలి అని పదే పదే నువ్వు నెగటివ్ వైబ్స్ పంపితే అవి తిరిగి నీకే తగిలే చాన్స్ ఉంది.
అందుకే మన పెద్ద వాళ్ళు చెప్తారు “పైన తథాస్తు దేవతలు ఉంటారు, మాటలు జాగ్రత్త” అని.
అందుకని తస్మాత్ జాగ్రత్త.