నేషనల్ హైవే పై కనబడిన మెయింటెనెస్ …
జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు నేషనల్ హైవే 65 గట్టు భీమవరం వద్ద గల టోల్ గేట్ వాహనాల వద్ద టోల్ వసూలు చేయడమే తప్ప,రహదారి మెయింటెనెస్ చేయడం లేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.సర్వీస్ రోడ్లు పాడైన పట్టించుకోవడం లేదని,ఫ్లైఓవర్ బ్రీడ్జీ గోడలకి సైతం చెట్లు పెరిగిన పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.టోల్ గేట్ రుసుము వాహనాల నుండి వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ సర్వీస్ రోడ్లను బాగు చేయడం లేదని,రోడ్ల వెంబడి చెట్లను మెయింటెయిన్ చేయడం టోల్ యాజమాన్యం పూర్తిగా ఫేల్ అయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.అటువంటప్పుడు టోల్ గేట్ రుసుము ఎందుకు చెల్లించాలని,టోల్ గేట్ ని తీసి వేయాలనే ప్రజల నుండి పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.మీ సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు