పోరాడండి.. లేదంటే చనిపోతారు…


ఈ మాటలు అన్నది ఎవరో కాదు. ప్రపంచ కుబేరుడు, టెస్లా వ్యవస్థాపకుడు ఆయన ఎలాన్ మస్క్.

బ్రిటన్ లోకి పెరిగిన వలసలు, ఇస్లామీకరణకు వ్యతిరేకంగా బ్రిటన్ అట్టుడుకుతుంది. వలసదారులను వెనక్కి పంపేయాలని డిమాండ్ చేస్తూ బ్రిటన్ స్థానిక ప్రజలు నిరసనకు చేపట్టారు. నిన్న సుమారు లక్షన్నర మంది నిరసనకారులు లండన్లో భారీ స్థాయి ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ బ్రిటన్ చరిత్రలోనే అతిపెద్దదని బ్రిటన్ పోలీసులు పేర్కొన్నారు.

*ఎందుకీ నిరసనలు. ?*

ఆశ్రయం కోరుతూ బ్రిటన్ లోకి ప్రవేశిస్తున్న వలసదారుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఈ వలసదారులతో స్థానికులకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దేశ వనరులను, ఉద్యోగాలను కొల్లగొడుతూ, స్థానిక సంస్కృతిని నాశనం చేస్తూ స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు.

అందులో ముఖ్యంగా పాకిస్థాన్ నుండి వచ్చిన అక్రమ వలసదారులు గ్రూమింగ్ గ్యాంగ్ పేరుతో ముఠాలుగా ఏర్పడి బ్రిటన్ అమ్మాయిలను సామూహిక మానభంగం చేయడం, ఆపై హత్యలు చేయడం ఒక పనిగా పెట్టుకున్నారు. ఒక అంచనా ప్రకారం బ్రిటన్ లో ప్రతి 5 మంది టీనేజ్ అమ్మాయిల్లో ముగ్గురు ఈ గ్రూమింగ్ గ్యాంగ్ బాధితులుగా మారే అవకాశం ఉందనేది ఆందోళన కలిగించే అంశం.

*గళమెత్తిన జాతీయవాది..*

వలసలు, ఇస్లామీకరణకు వ్యతిరేకంగా బ్రిటన్ లో జర్నలిస్టుగా పనిచేస్తున్న టామీ రాబిన్సన్ గళమెత్తారు. యునైటెడ్ ది కింగ్డమ్ అని ఆయన ఇచ్చిన నినాదంతో బ్రిటన్ ప్రజలు ఆందోళనకు దిగారు.

రాబిన్సన్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఎలాన్ మస్క్ వర్చువల్ గా మాట్లాడారు.

” బ్రిటన్ పౌరుడుగా ఉండటం గొప్ప విషయం. కానీ దేశం నాశనం అవడం నేను ఇప్పుడు చూస్తున్న. చిన్న కొత్తగా ఇది మొదలైంది. కానీ ఇప్పుడు భారీ అక్రమ వలసలతో నిండిపోయింది. ఇది ఇలానే కొనసాగితే మీరు హింసను కోరుకోకపోయినా విధ్వంసం మీ వరకు వస్తుంది. ఇప్పుడు మీ వద్ద ఉన్నవి రెండే మార్గాలు. తిరిగి పోరాడండి.. లేదంటే చనిపోతారు. ఇదే నిజమని నేను నమ్ముతున్న” అని అన్నారు.

About The Author