రామ మందిర నిర్మాణం.. ఎన్నో ఏళ్ళుగా హిందూ బంధువులు ఎదురుచూస్తున్న ఘట్టం…

రామ మందిర నిర్మాణం.. ఎన్నో ఏళ్ళుగా హిందూ బంధువులు ఎదురుచూస్తున్న ఘట్టం. కోర్టుల్లో కేసులు నానుతూ ఉండడం వలన రామ మందిర నిర్మాణం ఆలస్యం అవుతూనే ఉంది. అయితే రామ మందిర నిర్మాణంపై యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ది మాత్రం ఒకటే మాట. కట్టించి తీరుతాం అని..! ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు హిందూ బంధువుల్లో నూతనోత్తేజాన్ని నింపాయి.

సుప్రీంకోర్టు ఈ వివాదాన్ని తర్వితగతిన పరిష్కరించాల్సిన ఆవస్యకత ఎంతైనావుందని ఆయన అన్నారు. కోర్టు పరిష్కరించలేని పక్షంలో తాము 24 గంటల్లో ఈ వివాదానికి పరిష్కారం చూపుతామన్నారు. అయోధ్య వివాదంపై కోర్టు తీర్పు కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారని యోగి ఆదిత్యనాధ్ అన్నారు. తీర్పు జాప్యం వల్ల ప్రజలలో అసహనం పెరుగుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ కేసు పరిష్కారం కాకూడదని కోరుకుంటోందని అన్నారు. రామ మందిర నిర్మాణంపై 24 గంటల్లో ఈ వివాదానికి పరిష్కారం చూపుతామని యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలకు అద్భుతమైన స్పందన వస్తోంది. యోగి అనుకుంటే ఏదైనా చేస్తారని.. రామ మందిరం ఆయన హయాంలోనే అతి త్వరలో నిర్మించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అవకాశం వస్తే నిజంగానే యోగి ఆదిత్యనాథ్ 24 గంటల్లో ఈ వివాదానికి పరిష్కారం చూపుతారని కొన్ని వేలమంది తమ స్పందనను సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు

About The Author