లోకులు కాకులు ఆంటీ..ఆమెలో దాగున్న విషాదగాధ వింటే అందరి గుండె తరుక్కు పోవాల్సిందే….

“అమ్మ” కడుపుకోతను కాసుల కోసం కామెడీ యాక్టర్ ను చేశారు కన్నింగ్ గాళ్లు…ఆమెలో దాగున్న విషాదగాధ వింటే అందరి గుండె తరుక్కు పోవాల్సిందే….

లోకులు కాకులు ఆంటీ..
మన సోషల్ మీడియా ఓ తల్లికి చాలా గౌరవంతో పెట్టిన పేరు..

ఈమె అసలు పేరు జ్యోతి..
5 ఏళ్ల క్రితం ఇంటర్మీడియట్ చదువుతున్న తన కొడుకు బైక్ ఆక్సిడెంట్ లో చనిపోయాడు..

అప్పటినుండి తను మాట్లాడే మాటల్లో తడబాటు, అస్పష్టత ఉంటుంది..

ఎదిగివచ్చిన ఏ కుర్రవాడు కనిపించినా, వాళ్లలో తన కొడుకును చూసుకుంటూ.. ఒక్కసారి “అమ్మా అనరా కొడకా” అంటూ ప్రేమతో వాళ్ళను అడుగుతుంది..
ఎవరైనా తనను ఆంటీ అని పిలిస్తే ఆంటీ అనకు, అమ్మా అని పిలువు అని ఓ నాలుగు తిడుతుంది..
తనకు కొడుకు లేడు కదా! ఆ బాధ ఈ పిలుపుతో కాస్త అయినా తగ్గించుకుందామని…

హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే, వాళ్ళను ఆపి హెల్మెట్ పెట్టుకో నాయనా అంటూ జాగ్రత్తలు చెప్తుంది,
తన కొడుకులా మరో తల్లి కొడుకు చనిపోకూడదని..
ఎక్కువగా మైత్రీవనం చుట్టుప్రక్కల తిరుగుతూ ఉంటుంది.. ఎందుకంటే, అక్కడ కనిపించేదంతా తన కొడుకుల్లాంటి కొడుకులే కదా!

ఎక్కడపడితే అక్కడ పార్కుల్లో, ఫుట్ పాత్ లపై నిద్రపోతూ ఉంటుంది,
కొడుకు లేని జ్ఞాపకాలను నిద్ర సాకుతో మరచిపోదామని..

అలాంటి పిచ్చితల్లిని మన యూట్యూబ్ చానెళ్లు కాసుల కోసం కామెడీ యాక్టర్ ని చేశాయి.పైశాచిక వీడియోల ద్వారా వచ్చే చిల్లర సొమ్ముతో ఆ చిల్లర ఛానెళ్ల కొడుకులకు ముద్ద దిగుతుంటే…..,ఆ తల్లికి మాత్రం కొడుకు లేడన్న దిగులుతో ఆకలితో అలమటించి కనిపించే ప్రతీ ఒక్కరినీ అన్నం పెట్టండి, డబ్బులు ఇవ్వండి అంటూ ప్రాధేయపడే ఈ తల్లిని ఎంతమంది తిట్టుకున్నారో..??
ఎంతమంది నవ్వుకున్నారో..??
ఎంతమంది సెల్ఫీలు తీసుకున్నారో..??

ఇప్పటిదాకా తెలియక నవ్వుకుని ఉండవచ్చు,
తెలియక ఆమె images ను facebook లో ట్రోల్ చెయ్యడానికి పెట్టి ఉండవచ్చు
అవన్నీ ఆపెద్దాం,
ఆ తల్లి నీకు ఎక్కడైనా కనిపిస్తే, దగ్గరకు వెళ్లి “బాగున్నావా అమ్మా” అని ఒక్కమాట అను,
ఆ మాటకు ఆ పిచ్చితల్లి ఎంతలా మురిసిపోతుందో
అమ్మమీద ప్రేమ ఉన్న ప్రతీ కొడుకూ ఆమెను గౌరవిస్తాడని కోరుకుంటూ..
మీ 9స్టార్ టీవి టీం…

About The Author