ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం… సిపిఎం
రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ, ప్రజలపై మెాపుతున్న భారాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో సిపిఎం ఆద్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పేర్కొన్నారు.
సిపిఎం ఎన్టీఆర్ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు రెండవ రోజు సందర్భంగా నందిగామ బాబు జగ్జీవన్ రామ్ భవనంలో ఆదివారం విలేకరుల సమావేశం లో బాబురావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలైన ప్రజలకు ఇచ్చిన హమీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.
సూపర్ సిక్స్ హమీలు అరకొరగా అమలు చేస్తూ సూపర్ హిట్ అని చెప్పటం సబబు కాదన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లను ప్రభుత్వం భరించలేక ప్రైవేటీకరణ చేయటం దుర్మార్గమన్నారు. గతంలో విజయవాడ సిద్దార్థ్ మెడికల్ కాలేజ్ ప్రైవేటు వ్యక్తుల
ఆధీనంలో వుంటే ఆనాడు మాజీ ముఖ్య మంత్రి ఎన్టీ రామారావు జాతీయ కరణ చేసిన చరిత్ర టిడిపి వుంటే, ప్రస్తుత ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజ్ లను ప్రైవేటీకరణ చేయటం సిగ్గు చేటన్నారు.
గత వైసిపి ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో మెడికల్ కాలేజ్ సీట్లు అమ్ము కుంటే, కూటమి ప్రభుత్వం ఏకంగా మెడికల్ కాలేజ్ లను ప్రైవేటీకరణ చేయటం హేయమైన చర్య అన్నారు. ఒక పక్క ప్రజారోగ్యం పూర్తిగా కుంటుపడి వాంతులు, విరేచనాలు అవుతున్న ప్రజాప్రతినిధులకు ఏమాత్రం పట్టడం లేదన్నారు. ఎన్టీఆర్ జిల్లా లో డయేరియా , వైరల్ జ్వరాలు విజృంభిస్తున్న నియంత్రణ లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. ఎ. కొండూరు మండలం లో కిడ్నీ వ్యాధి గ్రస్తులు పెరుగుతున్న , కిడ్నీ వ్యాధి నివారణ కు చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పేదవారికి ఇళ్ల స్థలాలకు
రెండు నుండి మూడు సెంట్లు చొప్పున పేద ప్రజలకు ఇస్తామని ఇచ్చిన హమీ ఇంతవరకు అమలు చేయడం లేదన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో పెద్ద ఎత్తున భూసేకరణ చేసి బడా కంపెనీలకు, స్మార్ట్ సిటీల కు కట్ట బెడుతూ
దోచుకుంటున్నారని తెలిపారు.
ప్రజాప్రతినిధులపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కృష్ణా, బుడమేరుకు వస్తున్న వరదల నివారణ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. వరదల
నుండి ప్రజలను కాపాడటం లో పాలకులు విఫలమవుతున్నారని పేర్కొన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు,సర్ చార్జీలు పేరుతో పెద్ద ఎత్తున ప్రజలపై భారాలు మెాపుతున్నారని తెలిపారు.
విజయవాడ మహోత్సవాలకు ప్రజాప్రతినిధులు ఎంత ఉత్సాహంగా వున్నారో ప్రజాసమస్యల పరిష్కారం లో కూడా అంతే ఉత్సాహంగా వుండాలని కోరారు. గొల్లపూడి లో దేవాలయ భూములలో విజయవాడ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. అదే దేవాలయ భూములలో ప్రజా ప్రయోజనాల కు ఉపయెాగించుకోవటానికి అనుమతులు ఇస్తారా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ, సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట కళ్యాణ్, ఎన్ సి హెచ్ శ్రీనివాస్, సిపిఎం నందిగామ కార్యదర్శి కటారపు గోపాల్, సిపిఎం నందిగామ కమిటీ సభ్యులు సయ్యద్ ఖాసిం, గోపి నాయిక్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.