టిడిపి సానుభూతిపరుడు కుటుంబం పై జనసేన నాయకుల దాడి…


జనసేన నాయకులు దాడి చేయటంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడిన తుంగల నరసింహ రావు భార్య…!!

పెదయాదర సర్పంచ్ గళ్ళ తిమోతి మరియు అతని అనునియుల నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని తమకు రక్షణ కల్పించాలని కోరిన తుంగల నరసింహ రావు…

కోటి యాబై లక్షల రూపాయల మైనింగ్ వివాదం లో పంచాయితీ సర్పంచ్…!!

పెదయాదర పంచాయితీ ప్రెసిడెంటు గల్లా తిమోతి పై తీవ్ర ఆరోపణలు చేసిన కూడా అధికారులు పట్టించుకోలేదని బాధితుడి ఆవేదన…

వివరాల్లోకి వెళ్తే…

చినయాదర లోని తుమ్మా చెరువు గ్రామంలో మైనింగ్ అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలించడం పై అధికారులకు పిర్యాదు చేసిన కూడా అధికారుల నుండి ఎటువంటి స్పందన కరువవ్వడంతో కోర్టును ఆశ్రయించిన పిర్యాదు దారుడు. కోర్టు నుండి నోటిసులు అందడంతో సర్పంచ్ అనుచరులు కారుల్లో వచ్చి తమ కుటుంబాన్ని బెదిరించే ప్రయత్నం చేశారని తెలిపిన నరసింహ రావు. కోటిన్నర రూపాయల మట్టి వివాదం ఎదుర్కొంటున్న వ్యక్తి జనసేన సర్పంచ్ కాగా పిర్యాదు దారుడు తెలుగుదేశం కావడంతో సీనియర్ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం కరవమంటే కప్పకు కోపం విడవ మంటే పాముకు కోపం అన్నట్లుగా మచిలీపట్నం కూటమి నాయకుల పరిస్థితి. ఇక్కడ ఎవరూ తగ్గే పరిస్థితి కనబడటం లేదు. ఎది ఏమైనా ఈ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి పార్టీ పరువు బజారున పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కోర్టులో దావా వేసిన వ్యక్తి ఇంట్లో లేని సమయంలో రాత్రి వేళ గల్లా తిమోతి, పవన్ కుమార్, విక్కుర్తి పూర్ణ, కంచర్లపల్లి కోందండ రామారావు, గల్లా లక్ష్మణ లు ఇంటికి వచ్చి బెదిరించడంతో ఎక్కడకు వెళ్ళినా న్యాయం జరగడం లేదు మాకు ఇక చావే శరణ్యం అని భావించిన పిర్యాదు దారుడి భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో మచిలీపట్టణం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

About The Author