బ్రోకలీ vs కాలీఫ్లవర్‌.. మీ ఆరోగ్యానికి ఏది బెస్ట్ అంటే..?


1.బ్రోకలి ప్రయోజనాలివే
ఒక కప్పు పచ్చి బ్రోకలీలో దాదాపు 30 కేలరీలు, 2 గ్రాముల ప్రోటీన్, 6 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2 గ్రాముల ఫైబర్ ఉంటాయి. బ్రోకలీలో విటమిన్ C పుష్కలంగా ఉండటం వల్ల ఇది రోగనిరోధక శక్తికి ఒక కవచంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ K, కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచుతాయి. బ్రోకలీలో ఉండే సల్ఫోరాఫేన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ శరీరంలోని వాపులను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరిగి, మలబద్ధకం సమస్య దూరమవుతుంది

2.కాలీఫ్లవర్ ప్రయోజనాలివే
ఒక కప్పు పచ్చి కాలీఫ్లవర్‌లో దాదాపు 27 కేలరీలు, 2 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2 గ్రాముల ఫైబర్ ఉంటాయి. కాలీఫ్లవర్‌లో కూడా విటమిన్ C, విటమిన్ K పుష్కలంగా ఉంటాయి. దీనిలోని ప్రత్యేకత కోలిన్. ఇది మెదడు పనితీరుకు, జ్ఞాపకశక్తికి, కండరాల కదలికలకు చాలా అవసరం. కాలీఫ్లవర్‌లో కూడా సల్ఫోరాఫేన్ ఉంటుంది, ఇది రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించగలదని పరిశోధనలు గుర్తించాయి. కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెటర్ ఆప్షన్.

ఏది ఎక్కువ ఆరోగ్యకరమైనది?
రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే. అయితే మీ అవసరాన్ని బట్టి ఎంపిక చేసుకోవచ్చు. మీకు విటమిన్లు, ఫైబర్ ఎక్కువగా కావాలంటే బ్రోకలీ బెటర్ ఛాయిస్. అదే మీరు తక్కువ కేలరీలు, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకోవాలనుకుంటే కాలీఫ్లవర్ సరైనది. రెండింటినీ మీ ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమమైన మార్గం

వీటిని వండే సరైన పద్ధతి..
ఈ కూరగాయలపై ఉండే పురుగుమందులు, రసాయనాలను తొలగించడానికి వండే ముందు. బ్రోకలీ లేదా కాలీఫ్లవర్ పువ్వులను విడదీసి శుభ్రంగా కడగాలి.ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని, కొద్దిగా ఉప్పు వేసి మరిగించాలి.నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ పువ్వులను అందులో వేసి ఒకటి లేదా రెండు నిమిషాలు ఉంచాలి. వెంటనే వాటిని తీసి చల్లని ఐస్ నీటిలో వేయాలి. ఇలా చేయడం వల్ల అవి మరీ మెత్తబడకుండా వాటి రంగు కోల్పోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ కూరగాయలు సూప్, సలాడ్, ఫ్రై లేదా కూర వండుకోవడానికి సిద్ధంగా ఉంటాయి.

ఇట్లు,
మీ ఆయుర్వేద వైద్యులు,
Dr.Venkatesh 9392857411.

About The Author