ఈ చేప కనపడితే ఏమి జరుగుతుంది…? భయపడుతున్న తీర ప్రాంతం…

ఈ చేప కనపడితే ఏమి జరుగుతుంది…?
భయపడుతున్న తీర ప్రాంతం…

జపాన్‌లో అరుదుగా కనిపించే ఓర్‌ఫిష్‌ చూసి అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇవి సముద్ర అడుగు భాగాన నివసిస్తుంటాయి. ప్రకృతి విపత్తులైన సునామి, భూకంపాలు సంభవించేటప్పుడు ఇవి ఒడ్డుకు వస్తాయని అక్కడి వారి నమ్మకం. శుక్రవారం టొయామా ప్రిఫెక్చర్‌ ద్వీప తీరంలో చేపలకోసం ఏర్పాటు చేసిన వలల్లో వీటిని కనుగొన్నట్లు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి. ఈ మధ్యకాలంలో ఇప్పటివరకు ఏడు ఓర్‌ఫిష్‌లు కనుగొన్నారు. ఈ వారం మొదట్లో 3.2 మీటర్ల పొడవున్న ఓర్‌ఫిష్‌ తొయామా సముద్ర తీరంలో కనిపించగా, మరో నాలుగు మీటర్లున్న చేప ఇముజు నౌకాశ్రయంలో ఏర్పాటు చేసిన వలల్లో చిక్కుకుంది. సాధారణంగా ఈ చేపలు సముద్ర అడుగుభాగాన 200 నుంచి 1000 మీటర్ల లోతులో జీవిస్తుంటాయి. వీటికి వెండి రంగుతో కూడిన చర్మం, ఎర్రని రెక్కలు ఉంటాయి. ఇవి సముద్రపు దేవుడి నుంచి సమాచారం తీసుకొస్తాయని అక్కడి పురాణాలు చెబుతాయి. సునామీలు సంభవించేటప్పుడు అవి వచ్చి హెచ్చరిస్తాయని ప్రజలు విశ్వసిస్తారు. కానీ శాస్ర్తవేత్తలు మాత్రం అవి మూఢనమ్మకాలని కొట్టిపడేస్తున్నారు. ‘‘భూకంపాలు ఏర్పడే ముందు అవి ఒడ్డుకు వస్తాయని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ పరమైన రుజువులు లేవు. కానీ అవి రావనిచెప్పే అవకాశాలు 100 శాతం లేవని మనం చెప్పలేం’’ అని ఉఓజు యాక్వేరియంలో పనిచేసే కజుసా సాయిబా అన్నారు. వాతావరణంలో ఏర్పడుతున్న మార్పుల కారణంగానే ఆ చేపలు సముద్ర ఉపరితలంపైకి వస్తూ ఉండొచ్చని పేర్కొన్నారు. 2011లో వచ్చిన ఫుకుషిమా భూకంపం, సునామి వల్ల సుమారు 20వేల మందికి పైగా ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఈ వాదన తప్పని తేలింది.

About The Author