తెలంగాణా అటవీశాఖ లో భారీ బదిలీలు…

అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కఠినంగా వ్యవహరించే నిబద్ధత, అంకితభావం కలిగిన అధికారులను నియమించాలనే ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు అటవీశాఖ భారీ బదిలీలకు శ్రీకారం చుట్టింది. దాదాపు 200 మంది అధికారులను బదిలీ చేసింది. అడవుల సంరక్షణ విషయంలో, అటవీ భూముల్లో చెట్ల పెంపకంపై చిత్తశుద్ధి చూపించే అధికారులను ముఖ్యమైన ప్రాంతాల్లో నియమించింది. జంగిల్ బచావో – జంగిల్ బడావో నినాదంతో అడవుల సంరక్షణకు, అటవీ భూముల్లో అడవి పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అడవిని రక్షించే బాధ్యతను అంకితభావం కలిగిన అధికారులకు అప్పగించాలని స్పష్టంగా చెప్పారు. ఎక్కువ మంది అధికారులు హైదరాబాద్ లో ఉండడం కాకుండా, క్షేత్రస్థాయిలో పనిచేయాలని కూడా సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అటవీశాఖ సంస్కరణలు ప్రారంభించింది. ముఖ్యమైన ప్రాంతాల్లో మంచి అధికారులను నియమించడం, స్మగ్లర్లకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి మెమోలు ఇవ్వడం లాంటి చర్యలు చేపట్టింది.

200 మంది బదిలీ
———————
అడవులను సంరక్షించడంలో మంచి పేరున్న అధికారులను ముఖ్యమైన ప్రాంతాల్లో నియమించింది. దీంతో చీఫ్ కన్సర్వేటర్ నుంచి బీట్ ఆఫీసర్ వరకు దాదాపు 200 మంది బదిలీ అయ్యారు. ఈ బదిలీల ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు. జిల్లా అటవీ అధికారులుగా పనిచేస్తున్న చీఫ్ కన్సర్వేటర్లు, కన్సర్వేటర్లు, డిఎఫ్ఓ స్థాయి కలిగిన 21 మందికి ముఖ్యమైన జిల్లాల బాధ్యతలు అప్పగించారు. చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎకె సిన్హాకు అచ్చంపేట బాధ్యతలు, కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ హోదా కలిగిన శర్వానంద్, వినోద్ కుమార్ లకు మెదక్, కవ్వాల్ బాధ్యతలు అప్పగించారు. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జనగామ, భూపాలపల్లి, ఖమ్మం, మంచిర్యాల, పాల్వంచ, కిన్నెరసాని, వరంగల్, ఖానాపూర్, నిజామాబాద్, అమ్రాబాద్, బాన్సువాడ, ఇల్లందు, కాగజ్ నగర్, ఇచ్చోడకు కొత్త డి.ఎఫ్.ఓ.లను నియమించారు. 19 మంది రేంజ్ ఆఫీసర్లను మార్చారు. మహబూబాబాద్, గూడూరు, గంగారం, బయ్యారం, ఆజంనగర్, పెద్దపల్లి, నర్సంపేట, మంచిర్యాల, డోర్నకల్, కరీంనగర్, కొత్తగూడెం, కెరమెరి, బెల్లంపల్లి, తిర్యాని, గాంధారి, బాన్సువాడ, పిట్లం, నాగిరెడ్డిపేట, దూలపల్లికి కొత్త రేంజ్ అధికారులను నియమించారు. ఫారెస్టర్లు, బీట్ ఆఫీసర్లు కలిపి 160 మందిని బదిలీ చేశారు.

11 మందిపై సస్పెన్షన్ వేటు, పలువురికి మెమోలు
——————————————————–
అడవులను రక్షించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, స్మగ్లర్లకు సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో అటవీశాఖ అధికారులు స్మగ్లర్లకు సహకరిస్తున్నారనే అభియోగాలతో ఇటీవల కాలంలో 11 మందిని అటవీశాఖ సస్పెండ్ చేసింది. సస్పెండైన వారిలో ఫారెస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ స్థాయి నుంచి గార్డుల వరకున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి మెమోలు జారీ చేశారు.

In accordance with the instructions of the Hon’ble CM Sri K. Chandrashekar Rao that to act tough in areas where the forest is large junk, committed and dedicated officers in the forest department have been posted. The government has transferred nearly 200 officers. Officers with commitment in protecting the forests and afforestation in forest areas are posted in important places recently Hon’ble CM has instructed to initiate steps for forest rejuvenation in forest lands with a slogan ‘Jangil Bachavo-Jangil Badavo’ (Save the forest and Improve the forest). CM made it very clear that the responsibility of saving the forest should be entrusted to officers with commitment. He said that instead of most of the officers working at headquarters they should be moved to field level. In tune with CM instructions forest reforms have been initiated. This includes appointing committed officers at important places, initiating action against those officers who helped the smugglers, issued memos to those officers who are irresponsible in their duties etc.

Officers with good record and name in protecting the forests have been appointed at important places. With this about 200 officers from Chief Conservator level to Beet officers have been transferred. CM has approved and signed on concerned file on Tuesday. 21 officers who are working currently at district level as Chief Conservators, Conservators and DFOs have been entrusted with the responsibility of the districts. Chief Conservator of forests AK Sinha to Achampet, Conservator of forests Sharwanand, Vinod Kumar to Medak and Kawaal, Mancherial, Nirmal, Nizamabad, Jangaon, Bhupalapally, Khammam, Palvancha, Kinnerasani, Warangal, Khanapur, Nizamabad, Amrabad, Banswada, Yellandu, Khagaznagar, Ichoda new DFOs have been appointed. 19 Range officers have been transferred. New Range officers are appointed at Mahabubabad, Gudur, Gangaram, Bayyaram, Azamnagar, Peddapalli, Narsampeta, Mancherial, Dornakal, Karimnagar, Kothagudem, Kerameri, Bellampally, Tiryani, Gandhari, Banswada, Pitlam, Nagireddypeta and Dulapally. In all 160 foresters and Beet officers are transferred.

Hon’ble CM has instructed recently that such of those officers who are careless and irresponsible in their duties of protecting the forests and also indulging and helping the smugglers are to be punished severely. With this on the complaint of colluding with the smugglers 11 forest officers have been suspended. These include from Forest development level to forest guards’ level. Memos have also been issued to those who are careless and irresponsible in their jobs.

About The Author