రాష్ట్రంలో పర్యటించనున్న 15 వ ఆర్ధిక సంఘానికి …
రాష్ట్రంలో పర్యటించనున్న 15 వ ఆర్ధిక సంఘానికి సమర్పించడానికి వివిధ శాఖల అధికారులు తగు నివేదికలు రూపొందించాలని ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు కోరారు. మంగళవారం సచివాలయంలో 15 వ ఆర్ధిక సంఘానికి సమర్పించవలసిన నివేదికపై ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, డి.జి.పి. యం.మహేందర్ రెడ్డి, జి.ఎ.డి. ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హా, వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, కార్యదర్శులు బి.వెంకటేశం, నవీన్ మిత్తల్, బెనహర్ మహేశ్ దత్ ఎక్కా, పి.సి.సి.ఎఫ్, పి.కె.ఝా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి మాట్లాడుతూ ఎన్.కె.సింగ్ నేతృత్వంలోని 15 వ ఆర్ధిక సంఘం ఈ నెల 18 నుండి 20 వరకు పర్యటిస్తుందని తెలిపారు. తమ పర్యటనలో 18 న Rural Local Bodies, Urban Local Bodies, Trade, Industry లకు సంబంధించిన వారిని కలవడంతో పాటు 19 న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి సమక్షంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం అవుతారని తెలిపారు. 20 న ఆర్ధిక నిపుణులతో సమావేశమైన అనంతరం క్షేత్ర పర్యటన చేస్తారని తెలిపారు. రైతుబంధు, రైతుభీమా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ భగీరథ, TS-iPASS, KCR Kit, KG to PG తదితర ప్రాధాన్యత అంశాల పై నివేదికలు రూపొందించాలన్నారు. ప్రభుత్వ ఆర్ధిక సలహాదారు జి.ఆర్. రెడ్డి ఫైనాన్స్ కమీషన్ మార్గదర్శకాలను వివరించడం తో పాటు రాష్ట్ర ప్రత్యేక అవసరాలను నివేధికలలో పొందుపరచాలన్నారు.