తెలంగాణ రాష్ట్రంలో న్యాయస్థానాలలో మౌళిక సదుపాయాలు…

తెలంగాణ రాష్ట్రంలో న్యాయస్థానాలలో మౌళిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి తెలిపారు. మంగళవారం సచివాలయంలో కోర్టులలో సౌకర్యాల కల్పనపై సమావేశం ఏర్పాటు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సుప్రీం కోర్టు న్యాయవాది గౌరవ అగ్రవాల్, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు రామకృష్ణా రావు, సునీల్ శర్మ, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్ రావు, హైకోర్టు అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, జిల్లాలలో నిర్మాణంలో ఉన్న కోర్టు కాంప్లెక్స్ ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అన్నారు. ఇంకా నిర్మించాల్సిన ప్రాంతాలలో సమీకృత కోర్టు కాంప్లెక్స్ లకు ప్రణాళిక లు రూపొందించాలని అధికారులను కోరారు. జిల్లాలలో జూడిషియల్ అధికారుల నివాస భవనాలను నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. కోర్టులలో ఖాళీగా ఉన్న పోస్టుల ను ప్రెసిడెన్సియల్ అర్డర్ ప్రకారం భర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

About The Author