రైల్వే స్టేషన్‌లో ఘోరం… అమ్మాయి పై గ్యాంగ్ రేప్…

నెల్లూరు జిల్లా సూళ్లూరిపేట రైల్వే స్టేషన్‌లో ఘోరం జరిగింది. రాత్రి రైలు ఎక్కేందుకు ప్లాట్‌ఫామ్ పైన వేచిఉన్న ప్రేమ జంటను బెదిరించి యువతిని ఎత్తుకెళ్లారు కామాంధులు. అంతటితో ఆగకుండా రైలు పట్టాల వెంబడి కొట్టుకుంటూ తీసుకెళ్లి.. ఐదుగురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలు వద్దని ఎంత ప్రాధేయపడినా కూడా దుర్మార్గులు కనికరించలేదు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు. బాధితురాలిని విజయనగరం జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు. కాకినాడకు చెందిన యువకుడు, బాధిత యువతి శ్రీసిటిలోని ఓ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు. తమతమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు బోకారో ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్‌ చివరిలో వేచి చూస్తున్నారు.
ప్లాట్‌ఫార్మ్ చివర కూర్చున్న వీరిపై కామాంధుల కన్ను పడింది. ప్లాట్‌ఫామ్ చివరిలో నిర్మానుష్యంగా ఉండడంతో ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు. అడ్డుకోబోయిన ప్రియుడిపై దాడి చేశారు. బాధిత యువతి, ప్రియుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైల్వేస్టేషన్ పరిసరాలను పోలీసులు పరిశీలించారు. తీవ్ర రక్తస్రావం అయి గాయాలతో బాధపడుతున్న యువతిని ఆసుప్రతికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలికి చికిత్స జరుగుతోంది.

About The Author