ప్రాణాలన్నా వదులుతా కానీ రాజి పడను… మమతా


అధికారుల తీరును నిరసిస్తూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చేపట్టిన సత్యాగ్రహ దీక్ష మంగళవారం కూడా కొనసాగుతోంది. దీదీ దీక్షకు పలు ప్రతిపక్ష పార్టీలు మద్దతిస్తున్నాయి. ఈ ఉదయం టీఎంసీ నేత, బెంగాలీ నటి ఇంద్రాణీ హల్దార్‌ మమతాబెనర్జీని కలిశారు. దీదీ ధర్నాకు సంఘీభావం ప్రకటించారు.

కాగా.. ధర్నా వేదిక వద్ద ఉన్న టీఎంసీ నేతలను ఉద్దేశిస్తూ మమతాబెనర్జీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వం ఆమె నిప్పులు చెరిగారు. ‘నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న వారినే ఈ రోజు మీరు(కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ) దొంగలంటున్నారు. నన్ను, రాజీవ్‌కుమార్‌ను దొంగ అంటున్నారు. మేం ఎవరి సొమ్ము తీసుకుని పారిపోయాం? ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా ఓ నిజాయతీపరుడిని పట్టుకుని మోసగాడు అంటే నేను చూస్తూ ఊరుకోను. వారికి అండగా నిలుస్తా. అందుకోసం నా ప్రాణాలు ఇవ్వాల్సి వచ్చినా సరే అందుకు నేను సిద్ధంగా ఉన్నా. అంతేగానీ రాజీపడే ప్రసక్తే లేదు’ అని దీదీ చెప్పుకొచ్చారు.

దీక్షలో పాల్గొననున్న చంద్రబాబు

మరోవైపు మమతాబెనర్జీ దీక్షకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతు పలికారు. దీదీతో కలిసి ఆయన కూడా దీక్షలో పాల్గొననున్నారు. ఈ మధ్యాహ్నానికి చంద్రబాబు కోల్‌కతా చేరుకునే అవకాశాలున్నాయి.

About The Author