BJP ప్రజా చైతన్య యాత్ర రెండవరోజు యాత్ర…

సత్య మేవ జయతే:
ప్రజా చైతన్య యాత్ర రెండవరోజు యాత్ర ఎచ్చెర్ల నుండి ప్రారంభమై రాజాం,పాలకొండ మీదుగా పార్వతిపురం చేరుకుంది.

ప్రజా చైతన్య యాత్రను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్రానికి తాను చేసిన అభివృద్ధి కంటే అవినీతి ఎక్కువ అని మండిపడ్డారు.

2014 ఎన్నికల ముందు డ్వాక్రా సంఘాల అక్క, చెల్లెలు రుణాలు కట్టవద్దు అని చెప్పి నేను మాఫీ చేస్తాను అని చెప్పిన చంద్రబాబు ఇంత వరకు కట్టలేదు మళ్ళీ మహిళలును మోసం చేయడానికి తాయిలాలు మొదలు పెట్టారు పెట్టారా అని ప్రశ్నించారు.

ఈరోజు రాష్ట్రంలో అమలవుతున్న అన్ని పథకలు కేంద్ర పథకాలు అని కానీ చంద్రబాబు పేరు మార్చి మోసం చేస్తున్నారు అని విమర్శించారు.

నాలుగున్నర సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని u-టర్న్ తీసుకున్న చంద్రబాబు కాంగ్రెస్ తో ఎందుకు కలిసారో చెప్పాలని డిమాండ్ చేశారు.

కేంద్రప్రభుత్వం ఏమి అభివృద్ధి చేయలేదన్న చంద్రబాబు విజయవాడ మొన్న జరిగిన సభలోరాష్ట్ర అభివృద్ధికి,నిధులకు సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు విసిరిన సవాలుకు ఇంత వరకు చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పలేదు అని ప్రశ్నించారు.

ఈ కార్యక్రమంలో యాత్రా ప్రముఖ్ ,ఉపాధ్యక్షులు తురగా నాగభూషణం గారు, రాష్ట్ర కార్యదర్శిలు వెంకటేష్ యాదవ్ గారు,అడపా నాగేంద్ర గారు,రాష్ట్ర నాయకురాలు సినీనటి శ్రీమతి మాధవిలత గారు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

About The Author