రెండు సార్లు మొగలులను ఓడించి, తరిమి కొట్టిన భారతీయ వీరవనిత ఏవరొ తెలుసా ….???
రెండు సార్లు మొగలులను ఓడించి, తరిమి కొట్టిన భారతీయ వీరవనిత ఏవరొ తెలుసా ….???
చత్రపతి శివాజి, లచ్చిత్ బర్ఫూకన్ లాంటి యోధులతొ సమానంగా మొగలులను తరిమి కొట్టిన వీరనారీమణులు కూడా భారతదేశంలొ ఉన్నారు. చరిత్రలొ కనుమరుగైన ఇటువంటి వారిలొ రాణి దుర్గావతి ఒకరు. 1524 లొ జన్మించిన రాణి దుర్గావతి, బుందేల్‌ఖండు సంస్థానములో ప్రసిద్ధికెక్కిన రాజులలో మొదటివాడైన చందవేల్ రాజుగారి కుమార్తె. చిన్నప్పటి నుండి రాజనీతిలొ, యుధ విధ్యలలొ ఆరితేరిన దుర్గావతి, 1545 లొ గడామండలా సంస్థానాధిపతి అయిన దళపతి ని వివాహం చేసుకున్నారు.
తరువాత దుర్గావతి ఒక కుమారునికి జన్మనిచ్చింది. తన కుమారినికి 10 సంవత్సరాల వయస్సు వచ్చే సరికి దుర్గవతి భర్త అకాల మరణం చెందారు. దీనితొ రాజ్యభారం తన మీద పడటంతొ దుర్గావతి, తన 10 సంవత్సరాల కుమారినికి పట్టాభిషేకం చేసి, గొండు రాజ్య పరిపాలనా వ్యవహారాలు నిర్వహించసాగింది. సాత్పురా పర్వతాలలొని చౌరాఘర్ ప్రాంతంలొ శత్రు ధుర్బేద్యమైన కొటను నిర్మించి, తన రాజధానిని చౌరాగర్ కు మార్చింది. దుర్గావతి పరిపాలనా సమయంలొ గొండు రాజ్యం వ్యాపార, వ్యావసాయ రంగాలలొ అధుతమైన అభివృధి సాధించింది. ప్రజల ఆర్ధిక స్తితిగతులు గొప్పగా మెరుగు పడ్దాయి.
దీనితొ గొండు రాజ్యం మీద కన్నేసిన మాల్వా రాజు బహదూర్ ఖాన్, పెద్ద సైన్యంతొ దుర్గావతి పై దండెత్తి వచ్చాడు. ఈ యుధంలొ విరొచితంగా పొరాడిన రాణి దుర్గావతి కొద్ది కాలంలొనే బహదూర్ ఖాన్ ను చావు దెబ్బ తీసి, బహదూర్ ను ఓడించి తరిమి కొట్తింది.
దీనితొ రాణి దుర్గావతి పేరు ఉపఖండం అంతటా మార్మొగిపొవడంతొ, మొగల్ రాజు అక్బర్ కూడా రాణి దుర్గావతి రాజ్యమైన గొండు రాజ్యాన్ని ఆక్రమించుకొవాలని పధకం పన్నాడు. దీనితొ 1562 లొ తన సైన్యంలొ అత్యంత గొప్ప వీరునిగా పేరొందిన మాజిద్ ఖాన్ కు పెద్ద మొత్తంలొ సైన్యాన్ని, అధునాతన ఆయుధాలనందించి దుర్గావతి పై పంపించాడు.
అయితే ఏ విధంగా చూసిన మొగల్ సైన్యంతొ పొల్చుకుంటే, తన సైనం ఏ విషయంలొనూ సరి తూగదు. దీనితొ దుర్గావతి ప్యూహాత్మకంగా కొండ ప్రాంతమైన నరాయి ప్రాంతానికి చేరుకుని, మొగల్ సైన్యం అక్కడకు చేరుకొగానే ఒక్కసారిగా గెరిల్లా పొరాటం చేసి, మొగలులను తరిమి కొట్టింది. ఈ విధంగా రెండు సార్లు మొగల్ సైన్యాన్ని ఓడించడంతొ … ఈసారి మాజిద్ ఖాన్ ఊహించనంత పెద్ద మొత్తంలొ సైన్యాన్ని, పిరంగులను తీసుకుని దుర్గావతిపై హఠార్తుగా దందయాత్ర మొదలు పెట్టాడు.
దీనితొ ఊహించని ఈ పరిణామం నుండి తేరుకున్న దుర్గావతి ధైర్యంగా సైన్యాన్ని ముందుకు నడిపి, విరొచితంగా పొరాడసాగింది. ఒక వైపు తన సైనికులు మరణిస్తున్నా, చివరకు తన కుమారుడు కూడా యుధంలొ మరణిచినా దైర్యం కొల్పొకుండా, వెనక్కు తగ్గకుండా పొరాటం కొనసాగించింది. మాజిద్ ఖాన్ స్వయంగా అమెతొ పొరాడాలని వచ్చినప్పటికీ, దుర్గావతి రౌద్రాన్ని చూసి భయపడి దగ్గరకు వచ్చే సాహసం చేయలేక పొయాడు. అయితే పెద్ద మొత్తంలొ కాల్బలం, సైన్యాన్ని కలిగి ఉన్న మొగలుల ధాటికి తన సైనికులంతా మరణించడంతొ, మొగలులకు లొంగి పొవడం ఇష్టం లేక 1564, జూన్ 24 వ తేదీన తన కరవాలంతొ, తన శిరస్సును ఖండించుకుని వీరమరణం పొందారు.
ఇప్పటికీ ప్రతిసంవత్సరం జూన్ 24 వ తేదీను మద్యప్రదేశ్ లొ బలిదాన్ దివస్ గా జరుపుకుంటారు. ఈ రణశూరయైన దుర్గావతి యొక్క సమాధి జబల్పూర్ లొ నున్నది
ఇది ఒక వెబ్సైట్లోని కథనం చిరంజీవి నిమ్మకూరు అన్న అనే ఒక ఫేస్ బుక్ ఫ్రెండ్ ద్వారా ఈ పోస్టును కాపీ చేయడం జరిగింది
ఆయన మనకు సమాచారం తీసుకురావాలని ఒక వెబ్సైట్ని స్థాపించాడు ఆ వెబ్సైట్ లింకు కింద మీకు ప్రైవేటు చేస్తున్నాను దయచేసి ఆ లింక్లోకి వెళ్లి వెబ్సైట్ని సందర్శించండి దేశభక్తి గల పోస్టులు చాలా అందులో ఉన్నాయి
మనం వెబ్సైట్స్ ని సందర్శిస్తే ఆయనకు ప్రోత్సాహకరం అందించినట్లు ఉంటుంది
అది చేసి క్రింద వెబ్సైట్ ఒక్క లింకుని ప్రైవేటు చేస్తున్నాను అందరూ