ఓ యువతీ యువకుల్లారా పారాహుషార్.
ఓ యువతీ యువకుల్లారా పారాహుషార్.
కాలేజీ చదువుల్లో మీరు చేసే అల్లరి చిల్లరి పనులు తర్వాత మీ జీవితాలను నాశనం చేయగలవు. తమ చెమటలు చిందించి నాలుగు డబ్బులు సంపాదించి… తమ పిల్లలు బాగా చదువుకోవాలని లక్షలు డొనేషన్లు కట్టి మిమల్ని కాలేజీలకు పంపుతుంటే… మేరు వెలగబెడుతున్నది ఏమిటో ఓ సారి ఆలోచించుకోండి. ఆకర్షనో… ప్రేమో… తెలియని వయస్సులే చేయాల్సిన పాడుపనులన్నీ చేస్తున్నారు. మీకు మంచి మాటలు చెప్పి… మిమల్ని సక్రమమైన మార్గంలో పెట్టాల్సిన తల్లిదండ్రులు మీ పై అపారమైన నమ్మకం వల్ల మిమల్ని వెనకేసుకు వస్తున్నారు. ఇక మీరుచేసే పాడుపనులను తప్పుపట్టాల్సిన సమాజం మీకు తెలియకుండా మిమల్ని మూడోకన్నుతో గమనిస్తూ పైశాచిక ఆనందం పొందుతుంది. మీ చెడు ఆకర్షణలను మీకుతెలియని మూడో కన్ను వెంటాడుతుంది… మీరు ఏకాంతంలో ఉన్నారని, మిమల్ని ఎవ్వరూ గమనించడం లేదని మీరు అనుకుంటున్నారు. కానీ మీ పాడుపనుల్ని వెయ్యికళ్లు గమనిస్తుందని ఓ సారి గుర్తుంచుకొండి… మీ క్షణికావేశాల తర్వాతి ఫలితాలను ఓ సారి ఆలోచించండి. సమాజంలో హుందాగా బ్రతికే మీ తల్లితండ్రులు… మీరు చేసే పనులకు ఎలా తిరుగగలరో.. మీ గౌరవమర్యాదలు ఏమవుతాయో ఓ సారి ఆలోచించండి. మీ ఆకర్షణల ఫలితాల సాక్షాలు మీ వైవాహిక జీవితంలో మిమల్ని అనుక్షణం వెక్కిరిస్తాయి…మిమల్ని వెంటాడుతాయి… చివరకు మీ కుటుంబాన్నే చిన్నాభిన్నం చేస్తుంది.
కాబట్టి ఓ యువతా పారాహుషార్.