హైదరాబాద్ నగరాన్ని నిజమైన గ్లోబల్ సిటీగా మార్చేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించి…

హైదరాబాద్ నగరాన్ని నిజమైన గ్లోబల్ సిటీగా మార్చేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించి, అమలు చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. నగరాలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొన్ని సమస్యలుత్పన్నమవుతాయి, అలాంటి సమస్యలను ముందుగానే అంచనా వేసి, పరిష్కారాలు చూపే ప్రణాళిక రూపొందించి, అమలు చేయాలి. హైదరాబాద్ వైపే అందరూ ఆకర్షితులు కాకుండా, ప్రత్యామ్నాయంగా చుట్టు పక్కల పట్టణాలను కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచే విధంగా అభివృద్ధి చేసే వ్యూహం (కౌంటర్ మాగ్నెట్) రూపొందించాలన్నారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కి) ఆధ్వర్యంలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో భవిష్యత్తు అవసరాలకు తగినట్టు హైదరాబాద్ నగర మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని స్పష్టం చేశారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని రూపొందించే మాస్టర్ ప్లాన్ లో రాష్ట్ర మంత్రివర్గం మినహా మరెవరూ మార్పులు చేయకుండా చట్టం రూపొందిస్తామని వెల్లడించారు. హైదరాబాద్ నగర సమగ్రాభివృద్ధి ప్రణాళికను అమలు చేసే బాధ్యతను కేవలం హెచ్ఎండిఏ పై మాత్రమే పెట్టకుండా, వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులతో వివిధ ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. నగరాభివృద్ధికి జిహెచ్ఎంసి నిధులపైనే ఆధారపడకుండా ఇతరత్రా నిధులు కూడా సమకూరుస్తామని చెప్పారు.

ఓఆర్ఆర్ లోపలున్న నగరం, ఓఆర్ఆర్ అవతల నుంచి ప్రతిపాదిత ఆర్ఆర్ఆర్ మధ్యనున్న నగరం, ఆర్ఆర్ఆర్ అవతల విస్తరించే నగరం యూనిట్లుగా హైదరాబాద్ మహానగరాన్ని భవిష్యత్ అవసరాలకు తగినట్లు సన్నద్ధం చేసే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.కె.జోషి, ఆస్కి అర్బన్ గవర్నెన్స్ విభాగాధిపతి శ్రీ వి. శ్రీనివాసాచారి, ఫ్యాకల్టీ శ్రీమతి మాలినీ రెడ్డి, సిఎంఓ కార్యదర్శులు శ్రీమతి స్మితా సభర్వాల్, శ్రీ మాణిక్ రాజ్, శ్రీ సందీప్ సుల్తానియా, మాజీ స్పీకర్ శ్రీ మధుసూదనా చారి, ఎమ్మెల్యేలు శ్రీ డి.ఎస్. రెడ్యానాయక్, శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ శ్రీ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘‘హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం పెద్ద ఎత్తున హైదరాబాద్ కు వలస వస్తున్నారు. నగరంలోని వాతావరణం, సామరస్య పూర్వక జీవనం, మంచి పారిశ్రామిక విధానం ఫలితంగా పెద్ద ఎత్తున ఐటి కంపెనీలు, పరిశ్రమలు తరలి రావడంతో ఉద్యోగావకాశాలు పెరిగాయి. హోటల్, నిర్మాణ రంగంలో కూడా ఎంతో మందికి ఉపాధి దొరుకుతున్నది. ఈ కారణాల వల్ల ప్రతీ ఏటా ఐదారు లక్షల జనాభా హైదరాబాద్ కు జత కలుస్తున్నది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా, దేశ నలుమూలల నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడుతున్నారు. ఉద్యోగ, వ్యాపారాల రీత్యా నిత్యం హైదరాబాద్ నగరానికి వచ్చి పోయే వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతీ ఏటా రెండు కోట్లకు పైగా ప్రయాణికులు వచ్చిపోతున్నారు. ఇదంతా ఆర్థికాభివృద్దికి దోహదపడే అంశం. చాలా సంతోషకరమైన విషయం కూడా. కానీ, పెరుగుతున్న జనాభా, వారి అవసరాలకు తగినట్లు హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దకుంటే మాత్రం నగర జీవిత నరకప్రాయంగా మారక తప్పదు’’ అని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

‘‘హైదరాబాద్ నగరం నిర్మించేటప్పుడు కులీ కుతుబ్ షా ఒక మాట చెప్పారు. నేను నగరాన్ని కాదు, జన్నత్ (స్వర్గం) నిర్మిస్తున్నా అన్నారు. నిజంగా హైదరాబాద్ ఒకప్పుడు స్వర్గంగానే ఉండేది. హైదరాబాద్ నగరమంటేనే ముత్యాలు, సరస్సులు, ఉద్యానవనాలతో నిండి ఉండేది. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది. కానీ రానురాను పరిస్థితి మారిపోయింది. మూసీ నదిని మురికి ప్రాయం చేశారు. నగరంలో కాలుష్యం పెరిగిపోతున్నది. ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. పచ్చదనం తగ్గిపోయింది. రానున్న కాలంలో జనాభా మరింత పెరిగి, పరిస్థితి చేయిదాటిపోతుంది. జీవనం దుర్భరంగా మారుతుంది. కాబట్టి మనమంతా ఇప్పుడే మేల్కొనాలి. భవిష్యత్ అవసరాలను అంచనా వేసి, దానికి తగినట్లు హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలి. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ రూపొందించి, అమలు చేయాలి’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

‘‘హైదరాబాద్ ఇప్పుడెలా ఉంది? జనాభా ఎంత ఉంది? రోడ్లెలా ఉన్నాయి? ట్రాఫిక్ పరిస్థితి ఏమిటి? సీవరేజి పరిస్థితి ఏమిటి? గ్రీన్ కవర్ పరిస్థితి ఏమిటి? వాహనాలు ఎన్ని ఉన్నాయి? రవాణా వ్యవస్థ ఎలా ఉంది? విద్యుత్ సరఫరా పరిస్థితి ఏమిటి? అనే దానిపై నిర్ధారణకు రావాలి. పదేళ్ల తర్వాత హైదరాబాద్ ఎలా ఉండబోతుందో శాస్త్రీయంగా అంచనా వేయాలి. దానికి తగినట్లు ఏమి చేయాలనే దానిపై మాస్టర్ ప్లాన్ రూపొందించాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు.

‘‘ఢిల్లీ, బెంగులూరు లాంటి నగరాలే కాదు, చైనా రాజధాని బీజింగ్ లాంటి నగరాలు కూడా జనజీవనానికి ఇప్పుడు అనువుగా లేవు. ఢిల్లీ కాలుష్య వలయంలో చిక్కుకుంది. బెంగులూరులో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువయ్యాయి. మన కళ్ల ముందే నగరాలు ఆగమయిపోతున్నాయి. ఈ క్షణానికి హైదరాబాద్ పరిస్థితి బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఇప్పటికిప్పుడు మేల్కొని సరైన విధంగా సన్నద్ధం కాకుంటే ఈ నగరం పరిస్థితి కూడా విషమిస్తుంది. మనిషి జీవితమే ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి మనుషులు సౌకర్యంగా, ప్రశాంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించి, అమలు చేయాల్సిన తక్షణ అవసరం ఉంది’’ అని సీఎం చెప్పారు.

‘‘హైదరాబాద్ నగరం లోపలా, బయటా పచ్చదనం పెంచాల్సిన అవసరం ఉంది. హెచ్ఎండిఏ పరిధిలోని భూభాగం చాలా పెద్దగా ఉండడంతో మొత్తం భూభాగాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. వ్యవసాయ క్షేత్రాలను ఓపెన్ ప్లేసులుగా పరిగణించి, మిగతా చోట్ల ఇష్టారీతిన భవనాలకు, నిర్మాణాలకు అనుమతులిస్తారు. దీంతో ప్రధాన నగరంలో పచ్చదనం కరువవుతున్నది. ఇదే పరిస్థితి ఇక ముందు కూడా కొనసాగితే నగరంలో వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. కాబట్టి అనుమతుల విషయంలో నియంత్రణ ఉండాలి. పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలన్నింటినీ ప్రధాన నగరం అవతలికి తరలించాలి. మూతపడిన పరిశ్రమల భూముల్లో పార్కులు ఏర్పాటు చేయాలి. నగరంలో ఎక్కడ ఖాళీ జాగా ఉంటే అక్కడ పచ్చదనం పెంచాలి. లక్షా 50 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న అటవీ బ్లాకుల్లో అడవిని పునరుద్ధరించాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు.

‘‘హైదరాబాద్ నగరాన్ని మూడు భాగాలుగా విభజించి, ప్రణాళిక రూపొందించాలి. ఓఆర్ఆర్ లోపలున్న నగరం… ఓఆర్ఆర్ అవతలి నుంచి ప్రతిపాదిత రీజనల్ రింగు రిడ్డు వరకుండే నగరం… ఆర్ఆర్ఆర్ అవతల మరో ఐదు కిలోమీటర్ల వరకు విస్తరించే నగరం… ఇలా మూడు భాగాలుగా విభజించుకుని మంచినీరు, డ్రైనేజి, సీవరేజి, ట్రాఫిక్, రవాణా, విద్యుత్ సరఫరా తదితర అంశాల్లో ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో అంచనా వేయాలి. భవిష్యత్తులో ఎక్కడ ఏమి చేయాలో నిర్ణయించాలి. ఎడ్యుకేషన్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, సినిమా సిటీ, హెల్త్ సిటీ… ఇలా దేనికి అది ప్రత్యేకంగా ఉండేలా ప్రాంతాలను గుర్తించాలి. దాని ప్రకారమే అనుమతులు ఇవ్వాలి. ఏ భూభాగాన్ని ఎందుకోసం కేటాయించామో అందుకే వినియోగించాలి. మాస్టర్ ప్లాన్ ను ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించడానికి వీల్లేదు. మాస్టర్ ప్లాన్ లో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే దానికి మంత్రివర్గం అనుమతిని తప్పనిసరి చేస్తూ చట్టం తెస్తాం’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

‘‘నగరాలకు వలసలను ఆపలేం. హైదరాబాద్ లాంటి అనేక అనుకూలతలున్న నగరానికి వలసలు మరింత ఎక్కువ కాకతప్పదు. పెరిగే జనాభాకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్ అవసరాల కోసం సన్నద్ధం చేయడమొక్కడే మనముందున్న మార్గం. మంచి మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. ఆస్కీకి ఆ పని అప్పగిస్తాం. వారు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ సంస్థలను కన్సల్టెన్సీలుగా నియమించుకోవాలి. వారికి అవసరమైన మౌలిక సమాచారాన్ని ఇవ్వాలి. మూడు నెలల్లో నగరానికి మంచి మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. ఈ మాస్టర్ ప్లాన్ అమలు చేయడం కేవలం హెచ్ఎండిఏకి సాధ్యం కాదు. కాబట్టి మరికొన్ని ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేయాలి. ఈ బృహత్ కార్యక్రమాన్ని నిర్వర్తించేందుకు అవసరమైన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది’’ అని ముఖ్యమంత్రి వివరించారు.

Hon’ble Chief Minister Sri K. Chandrashekar Rao has announced that for converting Hyderabad into a truthfully global city a comprehensive Master plan would be formulated and will be implemented. Along with the development of cities certain problems are cropping up and as such, those problems are to be assessed beforehand, find out solutions and for this a proper plan has to be evolved and counter magnets are to be developed. He said that the master plan would be drafted by the Administrative Staff College of India (ASCI) in consultation with a team of National and International experts keeping in view the future needs of the city. If any changes to the Master Plan, thus prepared, by ASCI taking into consideration all aspects of Hyderabad development, shall be done only with the consent of the Cabinet. Changes if any required shall be reported to the Chief Secretary who in turn bring to the notice of the Cabinet for approval. The CM said that instead of depending on a small body like HMDA for implementation of the Master Plan for comprehensive development of the city, there shall be a larger body consisting of experts drawn from various fields like sewerage, drinking water, power lines, traffic, environment etc. He said that instead of depending only on GHMC funds for development of city, funds will also be mobilized from various other sources.

The CM held a review meeting at Pragathi Bhavan on Saturday afternoon on Hyderabad City within and beyond ORR as well as within the RRR (Regional Ring Roads) for its comprehensive development and to prepare it in accordance with the future needs. Chief Advisor to Government Sri Rajiv Sharma, Chief Secretary Sri SK. Joshi, Former Speaker Sri Madhusudhana Chary, MLAs Sri Niranjan Reddy, Sri Redya Naik, Sri Ajay, MLC Sri Srinivas Reddy CM Secretaries Ms. Smita Sabarwal, Sri Sandeep Kumar Sultania, Additional Secretary Sri K. Manicka Raj, Special Secretary Sri K. Bhoopal Reddy, Administrative Staff College of India, Hyderabad, Head of the Urban Governance Sri V. Srinivas Chary, faculty Ms. Malini Reddy and others participated in the meeting.

“Hyderabad city is developing very fast. For employment opportunities and for livelihood there has been a large-scale migration to Hyderabad from various other places. The Climatic conditions, the harmonious life style and the excellent industrial policy resulted in establishment of several IT companies and industries and with this the employment opportunities have also increased considerably. Several people are getting livelihood in hotel and construction industry. This is adding five to six lakhs of population to Hyderabad annually. The people who migrate to Hyderabad from other places within the state and outside the state are settling permanently here. The floating population is also increasing day by day. From Hyderabad International Airport every year on an average nearly 2 Crore persons are commuting. All these helps for the economic development of the city which is a very happy thing. However, if Hyderabad is not developed in tune with the increasing population and their needs then the life in the city becomes miserable” said the CM.

“Already there are various issues and problems in Hyderabad. River Musi is totally spoiled and has become a drain. Pollution is on the increase in the city. There are enough of traffic problems. Green cover is coming down day by day. In future the population is likely to increase multi fold and it is possible that the situation may slip out of our hands. Life may become miserable. Its time that we are awaken and assessing the future needs of the city develop Hyderabad. For this it is necessary to prepare a master plan and implement the same” said the CM.

“What is the status of Hyderabad today? What is its population today? How are the roads? What are the traffic conditions? How is the sewerage? What about green cover? How many vehicles are there in Hyderabad? What about power supply position? On all such issues we should make a decision and assess scientifically what would be Hyderabad after 10 years down the line. Accordingly, the Master Plan has to be prepared” said the CM.

“It is not only the Delhi and Banglore cities but also the Chinese capital Beijing is not convenient to live. Delhi is totally suffering from pollution. In Banglore there are lot of traffic problems. As of now, though, Hyderabad appears to be alright but the fact is unless we awaken now and prepare for the future situation would be out of control. The existence of life will be a question mark. Hence, it is absolutely necessary that a Master Plan has to be prepared to enable people live comfortably and peacefully” said CM.

“There is a need to increase greenery within Hyderabad and HMDA as well as beyond them. Green zone being shown as agriculture zone and treating them as open places conversions are being done and at their will and pleasure permissions are given for constructions. With this in the main city the greenery has become a scarce commodity. It this is allowed to continue pollution levels will increase in the city. Hence there need to be a regulation on sanctioning permissions. For environment protection top priority is to be given. All pollutant industries must be shifted out from city. Industrial estates which are not in use due to closure are to be converted into green areas and parks. Every vacant place is to be converted into a green area. The 1,50,000 acres of forest blocks in and around Hyderabad should be rejuvenated as a forest” suggested the CM.

“The Hyderabad city should be divided into three parts and accordingly proper planning has to be done. The city within ORR, the city beyond ORR and within the proposed regional ring roads and the would be developed city beyond RRR are the three parts. In all these three parts assessments has to be made with regards to drinking water, drainage, sewerage, traffic, transport, power lines etc. A decision has to be made as to what is to be done in future in all these three areas. We need to identify areas with specific reference education city, sports city, cinema city, health city etc each one treating as special entities. Permissions are to be given accordingly. The area is to be utilized for the purpose for which it is meant. Under any circumstances Master plan cannot be violated. An Act will be passed that any change to Master plan shall be done with the consent of the Cabinet” said the CM.

“We cannot stop the migration to the cities and towns. Migration will be more to cities like Hyderabad where there are several facilities. The only alternate before us is to prepare the city for future needs and for the growing population. An excellent Master Plan has to be drafted. We will entrust that work to Administrative Staff College of India. They will appoint national and international experts from different agencies as consultants. We have to give the necessary basic information to them. Within three months the best of the Master Plan has to be drafted. Implementation of this Master plan is not possible for HMDA alone and hence expert bodies will be formed. For taking up this massive programme the required funds will be allocated and released by the government” said the CM.

The CM announced that foundation will be laid this month to the proposed reservoir to be constructed at Keshavapur for supply of drinking water to the Hyderabad City. The same will be completed expeditiously. CM said that Metro rail will be extended up to Airport.

About The Author