ఎలక్ట్రానిక్స్ కంపెనీల ఏర్పాటు కు భూమి పూజ చేసిన మంత్రి నారా లోకేష్…

ఫిబ్రవరి 10,తిరుపతి…

పది ఎలక్ట్రానిక్స్ కంపెనీల ఏర్పాటు కు భూమి పూజ చేసిన మంత్రి నారా లోకేష్

తిరుపతి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 1 లో 80 కోట్ల పెట్టుబడితో 700 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఏర్పాటు అయిన కార్బన్ మొబైల్స్ తయారీ కంపెనీ ని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్

మొత్తంగా 1445 కోట్ల పెట్టుబడి,7088 మందికి ఉద్యోగ అవకాశాలు

ఆంధ్రప్రదేశ్ కి వోల్టాస్ కంపెనీ.తిరుపతిలో 653 కోట్ల పెట్టుబడి పెట్టి 1680 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న వోల్టాస్

145 కోట్ల పెట్టుబడితో 1131 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తూ ఈఎంసి 2 లో మరో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న డిక్సన్

ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ హబ్ గా మారుతుంది.అనేక ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలు తిరుపతిలో ఏర్పాటు అవుతున్నాయి.మంత్రి నారా లోకేష్ మరో 10 ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీల ఏర్పాటు కి భూమి పూజ చేసారు.టాటా గ్రూప్ కంపెనీల్లో ఒక్కటైన వోల్టాస్ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు కాబోతుంది.ఏసీలు,ఫ్రిడ్జ్ లు,కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ లో ఉన్న వోల్టాస్ ఆంధ్రప్రదేశ్ లో 653 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. సుమారుగా 1680 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.సిసి టివి కెమెరాలు,డిజిటల్ వీడియో రికార్డర్,ఎల్ఈడి టివిలు తయారీ లో ఉన్న డిక్సన్ తన రెండో ప్లాంట్ ని తిరుపతి ఈఎంసి 2 లో ఏర్పాటు చేస్తుంది.కంపెనీ ఏర్పాటు కు 145 కోట్ల పెట్టుబడి పెట్టి,1131 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది డిక్సన్.మొబైల్ యాసీసరీస్ ,పవర్ బ్యాంక్స్,ఛార్జర్స్,ఈయర్ ఫోన్స్ తయారు చేసే ఆస్ట్రమ్ కంపెనీ 100 కోట్ల పెట్టుబడి పెట్టి వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించనుంది. సర్వర్లు తయారు చేసే ఎక్సట్రాన్ సర్వర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 357 కోట్ల పెట్టుబడి పెట్టి 900 మందికి ఉద్యోగాలు కల్పించనుంది.సెట్ టాప్ బాక్సులు తయారు చేసే కల్పిన్ ఎలక్ట్రానిక్స్ 49 కోట్ల పెట్టుబడి పెట్టి 752 మందికి ఉద్యోగాలు కల్పించనుంది.లితియం ఐయాన్ బ్యాటరీ,ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ తదితర ఉత్పత్తులు తయారు చేసే ఏవాస్ట్ లితియం బ్యాటరీ ప్రైవేట్ లిమిటెడ్ 35 కోట్ల పెట్టుబడి పెట్టి 350 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. ఎస్పిఎం మెషిన్లు తయారు చేసే తేజా ఇండస్ట్రీస్ 7 కోట్ల పెట్టుబడి పెట్టి 275 మందికి ఉద్యోగాలు కల్పించనుంది.అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు తయారు చేసే అరిటే ఐటీ సర్వీసెస్ కంపెనీ 6 కోట్ల పెట్టుబడి పెట్టి 100 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది.ఎల్ఈడి లైట్లు తయారు చేసే కామాక్షి సిస్టమ్స్ 8 కోట్ల పెట్టుబడి పెట్టి 150 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది.సోలార్ ఎల్ఈడి లాంతర్స్ తయారు చేసే ఆర్ఆర్ టెక్ పాత్ 2.5 కోట్ల పెట్టుబడి పెట్టి 50 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 1 లో 80 కోట్ల పెట్టుబడి తో 700 మందికి ఉద్యోగాలు కల్పించిన మొబైల్స్ తయారీ కార్బన్ కంపెనీ ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు.ఈ కంపెనీల ద్వారా మొత్తంగా 1444 కోట్ల పెట్టుబడి,7088 మందికి ఉద్యోగాలు రానున్నాయి. #iprap Nara Lokesh Chittoor District

About The Author