తెలంగాణలోని వాణిజ్య, పారిశ్రామికవేత్తలు…

తెలంగాణలోని వాణిజ్య, పారిశ్రామికవేత్తలు, United Nations ప్రొక్యూర్ మెంట్ డివిజన్ కు సంబంధించిన వాణిజ్య అవకాశాలను పొందటానికి అవసరమైన సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని, వారికి సరైన అవగాహనను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి కోరారు. బుధవారం సచివాలయంలో యునైటెడ్ నేషన్స్ ప్రొక్యూర్ మెంట్ ఆఫీసర్ Mr. Bruno Maboja (బ్రోనో మబోజా) సి.యస్ ను కలిసారు. యునైటెడ్ నేషన్స్ ప్రొక్యూర్ మెంట్ డివిజన్ ద్వారా వివిధ UN సంస్ధలకు ICT, ఫార్మా, రియల్ ఎస్టేట్, ఎలక్ట్రికల్/పవర్, ఆఫీస్ ఎక్విప్ మెంట్, ట్రైనింగ్ అండ్ కన్సల్ టెన్సి, ఇంజనీరింగ్ సర్వీసెన్, ఫుడ్ వంటి తదితర రంగాలలో ఉన్న అవకాశాలను తెలంగాణ వాణిజ్యవేత్తలు పొందేలా తగు ప్రచారాన్ని నిర్వహించాలని సి.యస్ వారిని కోరారు. United Nations వాణిజ్య అవకాశాలపై హైదరాబాద్ లో సెమినార్ నిర్వహించడం అభినందనీయమని, వాణిజ్యవేత్తలకు అవసరమైన సూచనలు, సలహాలు అందించాలని, హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయాలని, వివరాలతో కూడిన హ్యండ్ బుక్ ను అందజేయాలని సి.యస్ వారిని కోరారు. తెలంగాణ వాణిజ్యవేత్తలు ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తున్నారని, వారికి ఇదొక మంచి అవకాశమని సి.యస్ అన్నారు. రాష్ట్రముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో రాష్ట్రం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ది చెందుతుందని టి-హబ్, Financial District సందర్శంచాలని సి.యస్ వారిని కోరారు. సెమినార్ అనంతరం వివరాలను ఇవ్వాలని కోరారు. United Nations ప్రొక్యూర్ మెంట్ అధికారి బ్రోనో మబోజా(Mr. Bruno Maboja) మాట్లాడుతూ United Nations లో వాణిజ్య అవకాశాలపై అవగాహన కల్పించటానికి తాను మొదటిసారి పర్యటిస్తున్నానని సి.యస్ కు వివరించారు. వాణిజ్యపరంగా చాలా అవకాశాలు ఉన్నాయని, తెలంగాణ పారిశ్రామికవేత్తలు సద్వినియోగపరుచుకోనేలా ప్రోత్సహిస్తామని అన్నారు. UN లో వాణిజ్య అవకాశాలను పొందటానికి ఏవిధంగా అప్రోచ్ కావాలో తెలుపుతామని అన్నారు. FTAPCCI (Federation of Telangana and Andhra Pradesh Chambers of Commerce and Industries) తెలంగాణ ప్రభుత్వ సహకారంతో వెండర్లతో రేపు సెమినార్ నిర్వహిస్తున్నామని, వాణిజ్యవేత్తలకు అవసరమైన
సూచనలు, సలహాలు ఇస్తామన్నారు. వచ్చే 3 ఏళ్ళలో మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేస్తామని సి.యస్ కు వివరించారు. హైదారాబాద్ అద్భుతమైన నగరమని, మొదటిసారి పర్యటిస్తున్నామని ఈ సందర్భంగా సి.యస్ కు తెలిపారు. ఈ సమావేశంలో FTAPCCI CEO, Khyati Amol Naravane పాల్గొన్నారు.

About The Author