ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చేసే సెల్యూట్లు వేరువేరుగా ఉంటాయట…! ఎందుకో తెలుసా…?

ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చేసే సెల్యూట్లు వేరువేరుగా ఉంటాయట…! ఎందుకో తెలుసా…?

సెల్యూట్… గౌరవ వందనం. జెండాను, అమరవీరులను చూస్తూ కుడిచేయి ఎత్తి గర్వంగా చేసేది. సెల్యూట్ చేయడం అన్ని సేవలలో ఒకేలా ఉంటుందని చాలామంది అనుకుంటారు . కానీ మనదేశ త్రివిధదళాలు (ఆర్మీ,నేవీ,ఎయిర్ ఫోర్స్) చేసే సెల్యూట్లు వేర్వేరుగా ఉంటాయట! సెల్యూట్ చేయడం వలన మనమంతా ఒకటేనని, ఏ సైనికుడి మధ్యా ఎలాంటి విభేదాలు లేవని, సైనికుడి ధీరత్వం, శూరత్వానికి ప్రతీకగా సెల్యూట్ చేస్తారట.

మనదేశ త్రివిధ దళాలు చేస్తున్న సెల్యూట్స్ ఎలా చేస్తారో తెలుసుకుందాం.

1.ఇండియన్ ఆర్మీ:
మనదేశానికి కాపాలకాస్తున్న మనదేశ సైనికులు తమ కుడిచేతి అరచేతిని ఎదుటివ్యక్తి, జెండాకు ఎదురుగా సెల్యూట్ చేస్తారు. తమ అరచేతిని ఎదురుగా, అన్ని చేతివేళ్ళు దగ్గరికీ ఉండేలా, వేళ్ళ మధ్య ఎటువంటి గ్యాప్ లేకుండా, మధ్యవేలును కంటిరెప్పను తాకేలా లేదా తలపై ఉన్న టోపీ ముందు భాగాన్ని తాకేలా సెల్యూట్ చేస్తారు. ఇలా చేయడం వలన ఒకరిపై ఒకరికి నమ్మకం ఉందని మాత్రమే కాదు, తమ మనసులో ఎటువంటి చెడు ఉద్దేశాలు లేవని, ఎక్కడా ఎటువంటి ఆయుధాలు దాయలేదని గర్వంగా చెప్పడం…

2. ఇండియన్ నేవీ: ఇండియన్ నేవీ సైనికులు సెల్యూట్ ను, తమ అరచేయిని తమ నుదుటి నుండి భూమికి 90 డిగ్రీలు కిందికి ఉండేలా చేస్తారు.ఇలా ఎందుకు చేస్తారంటే నేవీ సైనికులు ఓడలలో ప్రయాణం చేస్తున్నప్పుడు తమ చేతులకు ఆయిల్, గ్రీజు వంటి వ్యర్థ పదార్థాలు చేతులకు అంటుకుంటూ ఉంటాయి. అందుకని గౌరవంగా ఉండటానికి తమ సెల్యూట్ ను తల నుండి భూమికి 90 డిగ్రీలు ఉండేలా చేస్తారు. –

3. ఇండియన్ ఎయిర్ ఫోర్స్: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 2006 మార్చి నుండి తమ నిబంధనలకు అనుకూలంగా కొత్త సెల్యూట్ చేస్తున్నారు. ఈ సెల్యూట్ ను తల భాగం నుండి 45 డిగ్రీలు భూమికి ఉండేలా, తమ చేతిని ఎలాంటి వంపూ లేకుండా నిటారుగా ఉండేలా చేస్తున్నారు. ఈ సెల్యూట్ ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ నేవీలకు మధ్యగా ఉంటుంది, అలాగే సౌకర్యవంతంగానూ ఉంటుంది. అయితే ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు కూడా ఇండియన్ ఆర్మీ సెల్యూటే చేసేవారు.

About The Author