మిషన్ కాకతీయతో మళ్లీ చెరువులకు పునర్వైభవం..KCR…
కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులు తెలంగాణ వ్యవసాయానికి శతాబ్దాల తరబడి ముఖ్య నీటి వనరుగా ఉన్నాయని, మిషన్ కాకతీయతో మళ్లీ చెరువులకు పునర్వైభవం రావాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. ప్రాజెక్టుల నీళ్లు, వర్షం నీళ్లు, పడబాటు నీళ్లు అన్నీ కూడా నేరుగా చెరువులకు చేరే విధంగా ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లోగా సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించాలన్నారు. చెరువులన్నీ నిండి కలకల లాడినప్పుడే మిషన్ కాకతీయ లక్ష్యం నెరవేరినట్లని సీఎం అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో మిషన్ కాకతీయ – చిన్ననీటి వనరులపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.కె.జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రామకృష్ణ రావు, నీటి పారుదల శాఖ ఇఎన్సి శ్రీ మురళీధర్ రావు, కాడా కమిషన్ శ్రీ మల్సూర్, సిఇ శ్రీ శ్యాం సుందర్, కాడా డిడి శ్రీమతి స్నేహ, రిటైర్డ్ ఇఎన్సీ శ్రీ విజయ్ ప్రకాశ్, సీఎం ఓఎస్డీ శ్రీ శ్రీధర్ దేశ్ పాండే పాల్గొన్నారు.
‘‘ఒకప్పుడు తెలంగాణలో చిన్ననీటి వనరుల వ్యవస్థ ఎంతో బ్రహ్మాండంగా ఉండేది. కాకతీయులు తవ్విన గొలుసుకట్టు చెరువుల కింద పంటలు అద్భుతంగా పండేవి. ఒక చెరువు అలుగు పోస్తే గొలుసుకట్టులోని మిగతా చెరువులకు నీరందేది. చెరువులకు నీళ్లు పారేందుకు సహజసిద్ధమైన కాలువలు ఉండేవి. జాలువారు నీళ్లతో చెరువులు నిండేది. 1974లోనే అప్పటి బచావత్ అవార్డు ప్రకారం తెలంగాణ చెరువులకు రెండు బేసిన్లలో కలిపి 265 టిఎంసిల నీళ్ల కేటాయింపు ఉంది. రాను రాను చెరువులు నాశనం అయ్యాయి. తెలంగాణ బతుకు నాశనం అయింది. పంటలకు నీరివ్వడానికి తెలంగాణ రైతులు లక్షల కోట్లు ఖర్చు పెట్టి 25 లక్షల బోర్లు వేసుకున్నారు. అయినా పంటలు సరిగా పండలేదు. వ్యవసాయం దెబ్బతిన్నది’’ అని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘తెలంగాణలో చెరువులను పునరుద్ధరించడం కోసం మిషన్ కాకతీయ కార్యక్రమం తీసుకున్నాం. చెరువులను బాగు చేసుకున్నాం. ఆ చెరువులు నీటితో కళకళలాడితేనే మిషన్ కాకతీయకు సార్థకత. ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీళ్లతో చెరువులు నింపాలి. వర్షం నీళ్లు కూడా చెరువులకు చేరేలా చేయాలి. పడబాటు నీళ్లు కూడా కిందనున్న చెరువులకు నేరుగా పోవాలి. దీనికోసం సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలి. రాష్ట్రంలో 12,150 గొలుసుకట్టుల్లో 27,800 చెరువులున్నాయి. గొలుసుకట్టులోని మొదటి చెరువుకు నీరు అందిస్తే, దాని ద్వారా మిగతా చెరువులకు నీరందేలా ఫీడర్ కెనాల్స్ సిద్ధం చేయాలి. ఒకప్పుడు జాలువారు ఉండేది. బోర్లు ఎక్కువ వేయడం, భూగర్భ జలాలు అడుగంటి పోవడం వల్ల ఇప్పుడు జాలువారు లేదు. చెరువులు నిండితే, మళ్లీ భూగర్భ జలాలు పెరుగుతాయి. మళ్లీ జాలువారును చూడవచ్చు. ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీరు అందుతుంది. దీనికోసం అవసరమైన ఫీడర్ కెనాల్స్ వ్యవస్థను పునరుద్ధరించాలి. ఇంజనీరింగ్ అధికారులతో వర్క్ షాపు నిర్వహించి, దీని కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించాలి. ఈ సీజన్లోనే పనులు ప్రారంభం కావాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
‘‘చెరువులను పునరుద్ధరించడంతో పాటు రాష్ట్రంలో ఐబి, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ శాఖల ద్వారా పెద్ద సంఖ్యలో చెక్ డ్యాములు నిర్మిస్తున్నాం. చెరువుల్లో, చెక్ డ్యాముల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని సరిగ్గా లెక్క తీయాలి. అన్ని చిన్ననీటి వనరులను నీటితో కళకళ లాడేలా ప్రణాళిక రూపొందించి అమలు చేయాలి. దీనికి కావాల్సిన నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు.
Hon’ble CM Sri K. Chandrashekar Rao expressed his desire that the chain of tanks constructed during the Kakatiya period which were the main resource for centuries for cultivation in Telangana, have to be brought back to the past glory through the Mission Kakatiya. The CM instructed officers concerned that an integrated plan has to be formulated wherein the projects water, rainwater and regenerated water together are separately reaching straight away to the tanks. He said that a comprehensive project report on rejuvenating minor irrigation system and tanks system for interlinking tanks has to be prepared within a week and submitted to the government. The CM said that the rejuvenation of tanks under Mission Kakatiya will be completed and the objectives are achieved only when all the tanks are brimming and embellish with water.
The CM held a review meeting at Pragathi Bhavan on Friday afternoon on Mission Kakatiya and Minor Irrigation system resources. CS Sri SK. Joshi, Principal Secretary Finance Sri Rama Krishna Rao, ENC Sri Muralidhar, CADA Commissioner Sri Malsur, Chief Engineer Minor Engineer Sri Shyam Sunder, DD CADA Ms. Sneha, Retired Engineer in Chief Sri Vijay Prakash participated in the review.
“Once upon a time the minor irrigation system in Telangana was excellent. Bountiful of crops were the result of the chain of tanks constructed by the Kakatiya rulers. The excess water from one tank is to flow to a different tank in the chain naturally. There were natural feeder canals for flowing water into the tanks. Tanks were also to be filled with water flowing through catchment areas. In 1974 itself, in accordance with the Bachawat Tribunal award, 265 TMC of water from two river basins were allocated to the tanks in Telangana. In due course, the tanks were destroyed. The Telangana life too has been destroyed. To provide water for their crops the Telangana farmers spent lakhs of crores of money and dug more than 25 lakh of borewells. Even then there were not enough of crops and the agriculture faced destruction” said the CM.
“The government has taken up the Mission Kakatiya programme for revival and rejuvenation of tanks in Telangana. We could get the tanks repaired only when these tanks brim with water and embellish then the objectives of Mission Kakatiya are successful. Presently water from the tanks are to be used for filling the tanks. Efforts are to be made to reach the rainwater into the tanks. The regenerated water should also reach to the tanks straight away. For this, a comprehensive project report and plan of action has to be prepared. In Telangana 12,150 chains are identified in which there are 27,800 tanks. If water could reach the first tank in the chain, to enable excess water of the tank to reach the other tank in the chain feeder canals are to be got ready.
Once upon a time, there were natural flows here and there on the land. These are slowly disappeared in due course due to excess of borewells resulting in underground water getting drained out. If once the tanks are filled again the underground levels will increase. The natural flows also can be seen again. From one tank water flows to other tanks for which the feeder canal system has to be kept ready. A workshop has to be organised with engineering experts to prepare a plan of action and works are to be started during this season only” said CM.
“Along with revival and rejuvenation of tanks in the state check dams are being built by irrigation department, R&B and Panchayat Raj on a large scale. Statistical data has to be collected as to what exactly with the storage capacity of tanks and check dams. A Plan has to evolve to see that every tank is filled with water and brimming with water. The government is ready to provide adequate funds for this purpose” said the CM.