అగ్రహారం మిషన్ భగీరథ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ పనులను పరిశీలించినా అధికారులు…

15వ ఆర్థిక సంఘం ప్రతినిధులు ఆదివారం అగ్రహారం మిషన్ భగీరథ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ పనులను పరిశీలించారు .
సాయంత్రం సరిగ్గా 05.19గంటలకు వేములవాడ రాజ రాజేశ్వర స్వామి నంది కమాన్ వద్ద ఏర్పాటు చేసిన హెలి ప్యాడ్ ల వద్దకు హెలికాప్టర్ లో పదిహేనవ ఆర్థికసంఘం సభ్యులు చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి కూడ సభ్యులతో కలిసి వచ్చారు.
15వ ఆర్థిక సంఘం బృందం సభ్యులు అశోక్ లహరి, రిటా లహరి, అరవింద్ మెహతా, రవికోటా, అంటోని సిరాయిక్ లకు జిల్లా పాలనాధికారి శ్రీ వెంకట్రామరెడ్డి పుష్ప గుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు .
అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాలలో ఆర్థిక సంఘం సభ్యులు అగ్రహారం మిషన్ భగీరథ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను సందర్శించారు . మిషన్ భగీరథ ఇంజనీరులు మిషన్ భగీరథ పథకం ఉద్దేశం , లక్ష్యాలను వివరించారు . ఇప్పటి వరకు చేసిన వ్యయం వివరాలను తెలిపారు . ప్రాజెక్ట్ సమగ్ర నివేదిక నోట్ సభ్యులను అందజేశారు . అనంతరం ఆర్థిక సంఘం సభ్యులు మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులకు సంబంధించిన ఫొటోలు, మ్యాపులతో ఛాయాచిత్ర ప్రదర్శన ను తిలకించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ , మిషన్ భగీరథ అధికారులతో కలిసి అగ్రహారం మిషన్ భగీరథ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ పరిశీలించారు. ఆపరేషన్ , కంట్రోల్ విభాగం ,ఇంటేక్ వెల్ నుంచి నీరు వచ్చే విధానం , శుద్ధి ప్రక్రియ లను ఆర్థిక సంఘం సభ్యులు పరిశీలించారు ఈ సందర్భంగా ఇంజనీర్లు ప్లాంట్ లో విభాగాలు , వాటి పని తీరును సభ్యులకు RWS ENC శ్రీ కృపాకర్ రెడ్డి కూలంకషంగా వివరించారు . ఆర్థిక సంఘం సభ్యుల సందేహాలను మిషన్ భగీరథ అధికారులు నివృత్తి చేసారు.
మిషన్ భగీరథద్వారా ప్రతి ఇంటికి రక్షిత త్రాగునీరు : భగీరథ ఇంజనీర్లు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ ను చేపట్టిందని మిషన్ భగీరథ ఇంజనీర్లు ఆర్థిక సంఘం సభ్యులకు వివరించారు . రూ .44,979 కోట్ల రూపాయలతో కృష్ణ, గోదావరి నదులతోపాటు ఇతర జలాశయాలను కలిపి, 1.30 లక్షల కిలోమీటర్లు పైపులైన్ల మార్గం రాష్ట్రంలోని 23,968 గ్రామాలు మరియు 118 పట్టణాల్లోని ప్రతి ఇంటికీ తాగునీరు అందించబోతున్నారు. 26 సెగ్మెంట్ లుగా విభజించి పనులు చేపట్టామన్నారు . పనులు తుది దశకు చేరుకున్నయన్నారు . రూ.1085 కోట్లతో 351 ఆవాసాలకు నీరు అందించేందుకు చేపట్టిన సిరిసిల్ల – వేములవాడ – చొప్పదండి సెగ్మెంట్ పనులు పూర్తయ్యాయన్నారు .
అతి త్వరలో 100 శాతం పనులు పూర్తీ చేసి ప్రతి ఇంటికి నీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు .

ఆర్థిక సంఘ సభ్యుల పర్యటన దృష్ట్యా పటిష్ట భద్రత

ఆర్థిక సంఘ సభ్యుల పర్యటన దృష్ట్యా పోలీస్ అధికారులు పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు. ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే సభ్యులు వచ్చే ముందు హెలిప్యాడ్ వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.

పర్యటన ఏర్పాట్లు భేష్ : కలెక్టర్ కు ఆర్ధిక సంఘం సభ్యుల కితాబు :

మిషన్ భగీరథ పనుల పరిశీలన కు వచ్చిన ఆర్ధిక సంఘం సభ్యులు పర్యటన ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేసారు . తిరిగి వెళ్ళే సమయంలో జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట్రామ రెడ్డి ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి SK జోషి , ఆర్థిక సంఘం సభ్యులు ప్రత్యేకంగా పిలిచి అభినదించారు .
కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఎస్కేజోషి, ఆర్థిక శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ కె. రామకృష్ణా రావు, ప్రభుత్వ సలహదారు జీఆర్ రెడ్డి, 15వ ఆర్థిక సంఘం బృందం సభ్యులు అశోక్ లహరి, రిటా లహరి, అరవింద్ మెహతా, రవికోటా, అంటోని సిరాయిక్,, జిల్లా పాలనాధికారి వెంకట్రామరెడ్డి , ఎస్పి శ్రీ రాహుల్ హెగ్డే, జేసి యాస్మిన్ భాషా మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ పర్యవేక్షక ఇంజనీర్ ప్రకాష్ రావు , RDO టి శ్రీనివాస్ రావు , కార్యనిర్వాహక ఇంజనీర్ సురేష్ , తహసిల్దారు శ్రీనివాస్ ,తదితరులు పాల్గొన్నారు .

About The Author