అబు ధాబిలో హిందూ ఆలయం…
#superb news thanks for UAE
అబు ధాబిలో హిందూ ఆలయం..
ఇస్లాం దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబు ధాబి నగరంలో 26 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఓ హిందూ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు.
ఈ ఆలయ నిర్మాణం కోసం 2015లోనే యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ 16 ఎకరాల స్థలాన్ని ఉచితంగా కేటాయించగా, ఇటీవల యూఏఈ ప్రభుత్వం నిర్వహించిన సర్వమత సమ్మేళనం సందర్భంగా ఆలయంలో పార్కింగ్ ఇతర సౌకర్యాల కోసం మరో పది ఎకరాలు స్థలాన్ని విరాళంగా ప్రకటించారు.
అబు ధాబి–దుబాయ్ ప్రధాన రోడ్డు పక్కన నిర్మించనున్న స్వామి నారాయణ్ ఆలయ నిర్మాణానికి ఏప్రిల్ 13వ తేదీన మహంత్ స్వామి మహరాజ్ భూమి పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
స్వామి నారాయణ్ సంప్రదాయానికి చెందిన బ్రహ్మవిహారి స్వామి ఆలయ నిర్మాణ బాధ్యతలు చూస్తారు. అతిపెద్ద షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ మసీదుకు సమీపంలోనే ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం.
యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2019 సంవత్సరాన్ని టాలరెన్స్ (సహనం) సంవత్సరంగా ప్రకటించడమే కాకుండా టాలరెన్స్ పేరిట ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసింది.
యూఏఈలో 26 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరికోసం దుబాయిలో ఓ శివాలయం, కృష్ణుడి ఆలయం ఉండగా, అబుదాబిలో నిర్మించబోయే ఆలయమే మొదటిది.