వైఎస్ జగన్‌కు షాక్ ఇచ్చిన ఈసీ…
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వైసీపీ వ్యవస్థాపకుడు శివకుమార్ సస్పెన్షన్‌పై మార్చి 11లోపు వివరణ ఇవ్వాలని సీఈసీ ఆదేశించింది.
కాగా దివంగత రాజశేఖర్ రెడ్డి అభిమాని శివకుమార్.. 2009లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. వైఎస్‌పై ఉన్న అభిమానంతో ఆ పార్టీని జగన్‌కు అప్పగించారు. అప్పటినుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్, గౌరవాధ్యక్షురాలిగా విజయమ్మ కొనసాగుతున్నారు. శివకుమార్ మాత్రం వైసీపీలో క్రియా శీలక కార్యకర్తగా కొనసాగారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కు మద్దతివ్వడాన్ని శివకుమార్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో వైఎస్ జగన్.. శివకుమార్‌ను వైసీపీ నుంచి బహిష్కరించారు.
వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన శివకుమార్.. ఆ పార్టీ తనదని, తనను బహిష్కరించే అధికారం ఎవరికీ లేదని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది.