వర్మ ఇమ్రాన్ ఖాన్ కు రాత్రి చేసిన ట్వీట్లు వరుసగా..

వర్మ రాత్రి చేసిన ట్వీట్లు వరుసగా..

1.ప్రియమైన ప్రధాని ఇమ్రాన్ ఖాన్
సమస్యలు ఒక్కమాటతో పరిష్కారమైతే
మీకు మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు.

2.ప్రియమైన ప్రధాని ఇమ్రాన్ ఖాన్
ఒక వ్యక్తి టన్నుల కొద్ది ఆర్డీఎక్స్తో తమ వైపు పరిగెత్తుకొస్తున్నప్పుడు అతనితో ఎలా చర్చలు జరపాలో మా మొద్దు భారతీయులకు నేర్పించండి.. కావాలంటే మీకు ట్యూషన్ ఫీజు కూడా ఇస్తాము.

3.ప్రియమైన ప్రధాని ఇమ్రాన్ ఖాన్
ఒసామాలాంటి వ్యక్తి మీ దేశంలో ఉన్నాడని ఆమెరికాకు తెలుస్తుంది.. కానీ మీకు తెలియదు. మరి మీది అసలు దేశమేనా? చెప్పండి సార్ ఓ మొద్దు భారతీయుడు అడుగుతున్నాడు. మాకు కొంచం తెలివితేటలు నేర్పండి.

4.ప్రియమైన ప్రధాని ఇమ్రాన్ ఖాన్
జేష్-ఏ-మహ్మద్, లష్కర్-ఏ-తొయిబా, తాలిబన్, అల్-ఖయిదా మీ ప్లే స్టేషన్లు అని నాకు ఎవరూ చెప్పలేదు. కానీ మీరు కూడా వాటిపై మీకు ప్రేమ లేదన్న విషయాన్ని అంగీకరించలేదు.

5.ప్రియమైన ప్రధాని ఇమ్రాన్ ఖాన్
జేష్-ఏ-మహ్మద్, లష్కర్-ఏ-తొయిబా, తాలిబన్, అల్-ఖయిదాలను మీరు బంతులుగా భావించి.. పాకిస్థాన్ బౌండరీలు దాటిస్తూ.. ఇండియా పెవిలియన్లోకి పంపుతున్నారు. కానీ మీరు వాటిని క్రికెట్ బాల్స్ అనుకుంటున్నారా.. లేదా బాంబ్స్ అనుకుంటున్నారా.. కాస్త చెప్పండి సార్.

About The Author