BCCI డిమాండ్ కి తలవంచిన ICC భారత్ దెబ్బకి ప్రపంచ కప్ నుండి పాక్ అవుట్…

BCCI డిమాండ్ కి తలవంచిన ICC భారత్ దెబ్బకి ప్రపంచ కప్ నుండి పాక్ అవుట్ ..

క్రికెట్ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఉండాలా.. వద్దా.. ఏంటీ షాక్ అయ్యారా..? ఇప్పుడు ఇదే బిగ్ క్వశ్చన్ అయ్యింది. పుల్వామా దాడి తర్వాత పాక్ జట్టుతో క్రికెట్ ఆడకూడదనే డిమాండ్ ప్రజల నుండి వస్తుంది. బీసీసీఐ కూడా సరే అంటూనే.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా మా ఫైనల్ డెసిషన్ ఉంటుందని వెల్లడించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. BCCI మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

వచ్చే క్రికెట్ వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ జట్టును బహిష్కరించాలని కోరుతూ ICCకి లేఖ రాయాలంటూ రాహుల్ జోహ్రీని కోరినట్లు తెలుస్తుంది. రాహుల్ జోహ్రీ బీసీసీఐ తరుపున ఐసీసీ సమావేశాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టెర్రరిస్టుల దేశంగా ముద్రవేయాలని.. క్రీడల్లోనూ పాకిస్తాన్ జట్టును బహిష్కరించినప్పుడు ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందని బీసీసీఐ అభిప్రాయపడింది.

ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉగ్రదాడులు జరుగుతున్నా.. పాక్ లో ఆ దాడికి సంబంధించిన మూలాలు ఉంటున్నాయని లేఖలో ప్రస్తావించనుంది. పాక్ లేని ప్రపంచ క్రీడలను కోరుకుంటున్నామని.. అప్పుడైనా ఆ దేశం తీరు మారుతుందని తన వైఖరిని లేఖ ద్వారా ICC (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్)ను కోరనుంది. BCCI సంచలన నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్ని షాక్ కు గురిచేస్తోంది.

ప్రపంచంలోనే క్రికెట్ ఆడే దేశాల్లోనే ధనవంతమైన బోర్డు ఇది. అలాంటి బోర్డు నుంచే ఇలాంటి డిమాండ్ రావటంతో మిగతా దేశాలు షాక్ కు గురయ్యాయి. బీసీసీఐ నిర్ణయాన్ని ఆసియా దేశంలోని బంగ్లాదేశ్, శ్రీలంక క్రికెట్ బోర్డులు పాజిటివ్ గా స్పందించే అవకాశం ఉన్నా.. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, వెస్టిండీస్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఇతర క్రికెట్ దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయో అనేది చూడాలి.

About The Author