సినిమాగా రాబోతున్న సిక్కు వీరుల ఘనపోరాట చరిత్ర…!

సినిమాగా రాబోతున్న సిక్కు వీరుల ఘనపోరాట చరిత్ర!

వరల్డ్స్ మోస్ట్ డెడ్లీయెస్ట్ బ్యాటిల్ గా చరిత్రకెక్కిన యుద్ధం బ్యాటిల్ ఆఫ్ సారాగర్హి.

1897 సెప్టెంబరు పన్నెండున అఖండ భారతదేశంలో భాగమైన పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్ పర్వతసానువుల్లో సిఖ్ రెజిమెంట్ కు చెందిన కేవలం ఇరవైఒక్క మంది సైనికులు పదివేల మంది పష్తూన్ లతో యుద్ధం చేసి తాము నేలకొరిగేలోగా ఆరువందలమందికి పైగా శతృవులను హతమార్చారని చరిత్ర చెపుతోంది.

అంటే సగటున ఒక్కో సిక్కు వీరుడు నాలుగువందల డెబ్భైఆరుమంది శతృవులతో పోరాడాడు. ఎంతటి మహాసైన్యాన్నైనా గడగడలాడించే యుధ్ధ గణాంకాల నిష్పత్తి ఇది. హాలీవుడ్ చిత్రం 300 కల్పన అయితే సారాగర్హి యుద్ధం మాత్రం నిజంగా జరిగిన చరిత్ర.

మనం చరిత్ర పాఠాలలో చదవకపోయిప్పటికీ మొబైల్ డాటా విప్లవం తరువాత ఎన్నోపోస్ట్ లు, యూట్యూబ్ డాక్యుమెంటరీలతో పాటు 21-సర్ఫరోష్ సారాగర్హి అనేపేరుతో వెబ్ సిరీస్-టీవీ సీరియల్ గా కూడా వచ్చిన ఈవీరగాథ ఇప్పుడు బాలీవుడ్ తెరమీద కేసరి పేరుతో రానుంది. అక్షయకుమార్ మరోసారి సింగ్ ఈజ్ కింగ్ అనిపించేలా ఉన్నాడు.

About The Author