పాకిస్థాన్‌ నుంచి వివిధ రకాల సరుకులు మోసుకుని వస్తున్న లారీలకు వాఘా సరిహద్దు వద్ద అడ్డుకున్నా భారత్…?

పాకిస్థాన్‌ నుంచి వివిధ రకాల సరుకులు మోసుకుని వస్తున్న లారీలకు వాఘా సరిహద్దు వద్ద అడ్డుకున్నా భారత్-

బోర్డర్ లో కూడా వ్యాపారాలపై భారీ ప్రభావం చూపుతోంది. పుల్వామా ఘటన తర్వాత భారత వ్యాపారులు కూడా పాకిస్థాన్ కు సరుకులు పంపకూడదని నిర్ణయించుకున్నారు.

ఇక పాకిస్థాన్ కు కూడా సరికొత్త సమస్య ఎదురైంది. పాకిస్థాన్‌ నుంచి వివిధ రకాల సరుకులు మోసుకుని వస్తున్న లారీలకు వాఘా సరిహద్దు వద్ద అడ్డుకున్నారు. లారీల ప్రవేశానికి అనుమతించక పోవడంతో అట్టారి-వాఘా సరిహద్దులో ఎక్కువ వాహనాలు నిలిచిపోతున్నాయి.

పాకిస్థాన్‌ నుంచి సరుకుల దిగుమతిని భారత్‌ నిషేధించడంతో.. భారత్ వ్యాపారులు తమ అడ్వాన్స్ వెనక్కు ఇచ్చేయమని కోరుతున్నారు. దీంతో పాక్ వర్తకులు లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం సరిహద్దులో దాదాపు 250 లారీలు పైగా ప్రవేశం కోసం ఎదురు చూస్తున్నాయి.

పుల్వామా దుర్ఘటన తర్వాత భారత్ పాకిస్థాన్ పై విరుచుకుపడాలని భావిస్తోంది. అన్ని విధాలుగా పాక్ ను ఇబ్బంది పెట్టాలని భావిస్తోంది. అందులో భాగంగానే ఎక్సైజ్ సుంకాన్ని 200శాతానికి పెంచింది. దీంతో భారత్ నుండి పాకిస్థాన్ కు వెళుతున్న చాలా వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి.

నిత్యావసరాల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. టొమాటోలు ఏకంగా 180 రూపాయలు అంటే మామూలు విషయం కాదు. భవిష్యత్తులో వీటి ధర మరింత పెరిగే అవకాశం ఉందట. టొమాటో ధరలు ఆకాశానికి చేరగానే అక్కడి ప్రజలు షాక్ అవుతున్నారు.

About The Author