భారత దేవాలయాల్లోనే కాదు…మసీదుల్లో కూడా గంటలు మోగుతాయి.. పాక్‌పై ఓవైసీ ఫైర్…
భారత దేవాలయాల్లోనే కాదు…మసీదుల్లో కూడా గంటలు మోగుతాయి: పాక్‌పై ఓవైసీ ఫైర్.
పుల్వామా ఉగ్రదాడి ఖచ్చితంగా పాకిస్థాన్ పనేనని హైదరాబాద్ ఎంపీ అసదుద్దిన్ ఓవైసి ఆరోపించారు.. ఆ దేశ ఆర్మీ, ఐఎస్ఐ సహకారంతోనే జైషే మహ్మద్ ఉగ్రవాత సంస్థ భారత సైనికులపై దాడికి పాల్పడినట్లు తెలిపారు. ఇలా భారత సైనికులను పొట్టనబెట్టుకుని ఇప్పుడు తమకేమీ సంబంధం లేదని పాక్ తప్పించేకునే ప్రయత్నం చేస్తోందని ఓవైసి అన్నారు.
పాకిస్ధాన్ కు చెందిన ఓ మంత్రి భారత దేవాలయాల్లో గంట కొట్టడం ఆపగలరా? అంటూ ప్రశ్నించారని ఓవైసి గుర్తుచేశారు. అయితే కేవలం దేవాలయాల్లోనే కాదు మసీదుల్లో కూడా ఆజాన్ సౌండ్స్, నమాజ్ గంటలు మోగిస్తారని సదరు మంత్రి గుర్తించాలని…కేవలం భారత్ లో ఈ మతసామరస్యం కనిపిస్తుందని ఓవైసీ అన్నారు. భారతీయుల ఐక్యమత్యాన్ని చూసి పాక్ ఓర్వలేక పోతోందన్నారు. అంతర్గతంగా ఎన్ని గొడవలున్నా…దేశం జోలికి ఎవరైనా వస్తే భారతీయులంతా ఒక్కటేనని ఓవైసి తెలిపారు.
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కూడా ఓవైసీ ఐర్ అయ్యారు. భారత్ పై దాడి గురించి తమకేమీ తెలియదన్నట్లు ఇమ్రాన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కెమెరాల ముందు కూర్చుని ఇలా అమాయకత్వపు మాటలు చెప్పడాన్ని కట్టిపెట్టాలని సూచించారు. గతంలో పఠాన్ కోట్, ఉరి సైనిక స్థావరాలపై, ప్రస్తుతం పుల్వామాలో సైనికులపై దాడి చేయించింది మీరు కాదా? అని ఇమ్రాన్ ను ఓవైసీ ప్రశ్నించారు.
పుల్వామా ఉగ్రదాడి ఘటనపై పాక్ ప్రభుత్వ స్పందనపై మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ నిప్పులు చెరిగారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అమాయకత్వం నటిస్తున్నారని విమర్శించారు. ఇక్కడ జరిగిన ఒక ర్యాలీలో ఒవైసీ మాట్లాడుతూ, ఇమ్రాన్ ఖాన్ కెమెరా ముందు కూర్చుని భారత్‌కు సందేశాలు ఇవ్వక్కర్లేదని అన్నారు. పుల్వామా దాడి భారత్‌పై జరిగిన మొదటి దాడి ఏమీ కాదన్నారు. ‘పఠాన్‌కోట్, ఉరి…ఇప్పుడు పుల్వామా. పాకిస్థాన్ ప్రధాని అమాయకత్వం ముసుగు వీడాలని భారత్ తరఫున నేను కోరుతున్నా’ అని ఒవైసీ అన్నారు.
1947లో జిన్నా ప్రతిపాదిత దేశ విభజనను వ్యతిరేకించి ఐచ్ఛికంగానే ఇండియన్ ముస్లింలు ఈ దేశంలో ఉండిపోయారని ఒవైసీ గుర్తు చేశారు. భిన్నత్వంలో ఏకత్వం ఇండియా విధానమని, భారతదేశ పౌరులంతా కలిసిమెలిసి ఉండటం చూసి పాక్ కుళ్లుకుంటోందని విమర్శించారు.
‘పాకిస్థాన్‌కు చెందిన మంత్రి ఒకరు ఇటీవల ఇండియాలోని ఆలయాల్లో గంటలు మోగకుండా చేస్తామని హెచ్చరించారు. ఆయనకు నేను ఒక విషయం చెప్పదలచుకున్నాను. ఇండియా గురించి ఆయనకు తెలియదు. ఈ దేశానికి చెందిన ముస్లింలు బతికున్నంత కాలం, మసీదుల్లో అజాన్ వినిపిస్తుంది. గుడిగంటలు మోగుతూనే ఉంటాయి’ అని తీవ్రస్వరంతో అన్నారు. ఇండియా సౌందర్యమే అంతనీ, అందువల్లే పొరుగుదేశానికి (పాక్) అసూయగా ఉందని అన్నారు. భారతదేశ ప్రజలంతా ఒకటిగా జీవిస్తారని, దేశం కోసం ఒకటిగా ముందుకు నడుస్తారని ఒవైసీ పేర్కొన్నారు.
పుల్వామా పాశవిక దాడికి సంబంధించి పాక్ ఉగ్రవాద సంస్థ జైషే పాత్రపైనా ఒవైసీ విరుచుకుపడ్డారు. మొహమ్మద్‌ను నమ్మేవారెవరూ ఏ ఒక్కరినీ చంపరని అన్నారు. ‘ఈ దేశ పౌరుడిగా నేను ఒకటి చెప్పదలచుకున్నాను. పుల్వామా దాడితో పాకిస్థాన్‌కు లింక్‌లు ఉన్నాయి. పాక్ ప్రభుత్వం, పాక్ ఆర్మీ, ఐఎస్ఐ పథకం ప్రకారమే దాడి జరిగింది. మా వాళ్లు 40 మందిని జైషే పొట్టన పెట్టుకుంది. దాడికి తామే బాధ్యులమని కూడా ప్రకటించింది. నువ్వు జైషే మొహమ్మద్ కాదు…జైషే సైతాన్‌వి. మసూద్…నువ్వు మౌలానావి కాదు. సైతాన్‌వి. అది లష్కరే తొయిబా కాదు, లష్కరే సైతాన్’ అంటూ పాక్ ఉగ్రసంస్థలపై ఒవైసీ నిప్పులు చెరిగారు.