మన పాస్ పోర్ట్ మరింత పవర్ ఫుల్….

 

మన పాస్ పోర్ట్ మరింత పవర్ ఫుల్.

భారతదేశ పాస్ పోర్ట్ మరింత పవర్ ఫుల్ గా రూపాంతరం చెందుతోంది. చాలా దేశాలు భారత్ పాస్ పోర్టులకు ‘వీసా ఆన్ అరైవల్’ ను అందిస్తుండడం విశేషం. టైమ్స్ ఆఫ్ ఇండియా.. పాస్ పోర్ట్ ఇండెక్స్ ప్రకారం గత ఐదేళ్లలో మన పాస్ పోర్టుకు చాలా దేశాలు మంచి స్థానాన్ని ఇస్తున్నాయి.

మన దేశ పాస్ పోర్ట్ ను చేతిలో పెట్టుకుంటే చాలు.. ఎన్నో దేశాలు ఆహ్వానిస్తాయి. భారత్ పాస్ పోర్ట్ ర్యాంకు 2015లో 77వ స్థానంలో ఉండగా.. 2019లో 67వ స్థానంలోకి చేరింది. మన దేశ పాస్ పోర్ట్ తో వెళితే 25 దేశాలు వీసా-ఫ్రీ ఎంట్రీని అందిస్తుండగా.. 39 దేశాలు వీసా ఆన్ అరైవల్ ను అందిస్తున్నాయి.

గత కొద్ది ఏళ్ళుగా భారత పాస్ పోర్టుకు చాలా దేశాల్లో మంచి గుర్తింపు లభిస్తూ వస్తోంది. భారతీయులు ఎక్కువగా వస్తే తమ దేశాలు పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందుతాయని ఇతర దేశాలు భావిస్తున్నాయి.

అలాగే అనుమానితులు కూడా చాలా వరకూ తగ్గారని తెలుస్తోంది. కాబట్టి మన పాస్ పోర్ట్ తో పలు దేశాలు చుట్టేయొచ్చు. అయితే రాబోయే రోజుల్లో భారత పాస్ పోర్టుకు ఇంకొన్ని దేశాలు వీసా-ఫ్రీ ఎంట్రీని, వీసా ఆన్ అరైవల్ ను అందించబోతున్నాయి.

About The Author