కొత్తగా ఇల్లు కొనే వాళ్లకు శుభవార్త … GST తగ్గింపూ…
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. కన్స్ట్రక్షన్లో ఉన్న ఇళ్లను కొనుగోలు చేస్తూ ఇప్పటి దాకా 12 శాతం కడుతున్న జీఎస్టీని ఇక నుంచి 5శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే నివాసయోగ్య గృహాల పథకం కింద వచ్చే వారికి 8 శాతం జీఎస్టీని ఒక్క శాతానికి తగ్గించింది. దీన్ని మెట్రో నగరాల్లో అయితే 60చదరపు మీటర్లు, అతకంటే తక్కువ ఉంటే వాటిని అఫర్డబుల్ హౌసింగ్ కింద పరిగణిస్తారు. ఇతర నగరాల్లో 90 చదరపు మీటర్లు, అంతకంటే తక్కువ విస్తీర్ణం ఉండే ఇళ్లను పరిగణలోకి తీసుకుంటారు. రూ.45లక్షల కంటే తక్కువ విలువైన ప్రాపర్టీలకు ఒక్క శాతం జీఎస్టీ వర్తిస్తుంది.
అలాగే లాటరీల మీద పన్ను తగ్గింపు అంశానికి సంబంధించి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రస్తుతం ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించే లాటరీలకు 12శాతం జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తారు. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో నడిచే లాటరీలకు 28శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ ‘ రియల్ ఎస్టేట్ సెక్టార్ కు మేం బూస్ట్ ఇవ్వాలనుకుంటున్నాం. అందుకే నిర్మాణంలో ఉన్న ఇళ్ల మీద జీఎస్టీ తగ్గించాం.’ పేర్కొన్నారు.