ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి… మోదీని కోరిన ఇమ్రాన్ ఖాన్…
ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి… మోదీని కోరిన ఇమ్రాన్ ఖాన్…
పుల్వామా ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ఈ నేపథ్యంలో పాక్‌పై భారత్ యుద్దం చేయాలంటూ… డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ వార్తలతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామన్నారు ఇమ్రాన్. అయితే దీనికి సంబంధించి పాక్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో భారత్ ఉగ్రదాడికి సంబంధంచి సరైన ఆధారలు అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని పేర్కొంది .
దీంతో పాటు శాంతికి కూడ భారత్ ఓ అవకాశం ఇవ్వాలని ఇమ్రాన్ అందులో కోరారు. మరోసారి దయాది దేశాలు ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్నాయి. దీంతో ఇప్పటివరకు పూల్వామా దాడికి సరైన ఆధారాలు చూపాలంటూ మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్.. ఇప్పుడు గొంతు సవరించుకున్నారు. మీరు నిజంగా పఠాన్ బిడ్డైతే… ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న మోదీ విసిరిన సవాల్‌కు స్పందించారు.
అయితే పుల్వామా దాడి వెనక పాకిస్థాన్ హస్తం ఉందన్న భారత్ వాదనను ఇమ్రాన్‌ఖాన్ గతంలో తోసిపుచ్చారు. ఆధారాలుంటే చూపాలని సవాల్ విసిరారు. భారత్ యుద్ధానికి దిగితే తిప్పికొట్టడానికి పాక్ సిద్ధంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఆదివారం పాక్ విదేశాంగ మంత్రి మొహ్మద్ ఖురేషీ మాట్లాడుతూ..
పాక్ శాంతిని కోరుకుంటుందని తెలిపారు.రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి కలగజేసుకోవాలన్నారు. పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ఎన్నికైన సందర్భంగా మోదీపేదరికం, నిరక్షరాస్యతపై కలిసి పోరాడుదామంటూ ఇమ్రాన్‌కు పిలుపునిచ్చారు. దీనికి ఇమ్రాన్ స్పందిస్తూ.. తాను పఠాన్ వంశస్థుడినని, ఇచ్చిన మాట తప్పమని బదులిచ్చారు. ఆ సందేశాన్ని ఇప్పుడు ఉటంకిస్తూ పఠాన్ బిడ్డవైతే చర్యలు తీసుకోవాలంటూ మోదీ సవాల్ విసిరారు.