చైనా వెన్నులో ఒణుకు పుట్టించే అస్త్రం భారత్ చేతిలో…
చైనా వెన్నులో ఒణుకు పుట్టించే అస్త్రం భారత్ చేతిలో ఇక.. భారత్ తో పెట్టుకుంటే.. చైనా మాటస్
భారత్ వద్ద ప్రస్తుతం రెండు ఎయిర్ క్రాఫ్ట్స్, నాలుగు భూఉపరితల ఖండాంతర క్షిపణి వ్యవస్థలు, సముద్ర ఉపరితల ఖండాంతర క్షిపణి వ్యవస్థ ఉంది. అయితే మరొక రకం గల అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న వ్యవస్థను కూడా భారత్ రూపొందించే పనిలో ఉంది. మరొక దశాబ్ద కాలంలో ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. అగ్ని- 1 మరియు ఆధునీకరణకు ఉద్దేశించి తయారు చేసిన అగ్ని- 2, రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని చేరుకోగలదు.
అంటే చైనా లోని చాలా ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి. తాజాగా రూపొందించిన అగ్ని- 4ను భారత్ లోని ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రయోగిస్తే చైనా మొత్తాన్ని లక్ష్యంగా చేసుకోవచ్చు. సుదూర లక్ష్యాలను ఛేదించే అగ్ని-5 అభివృద్ధి దశలో ఉంది. ఇది పూర్తి అయితే భారత్ లో ఎక్కడినుండైనా దాడులు చేయవచ్చు అంటూ ఆ కథనంలో ప్రస్తావించారు. భారత్ – చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటం, పాకిస్థాన్ విషయంలో చైనా పదేపదే తలదూర్చడం, భారతకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టడం లాంటివి చేస్తూ ఉండటంతో ఈ ఆర్టికల్ సంచలంగా మారింది.
భారత్ తో యుద్దానికి దిగితే విధ్వంసకర నష్టాన్ని ఎదుర్కొనక తప్పదని చైనా భావించేలా ఈ కథనం ఉంది. పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 49 మంది సీఆర్పీఎఫ్ జవానులు అసువులు బాసిన సంగతి తెలిసిందే. ఉగ్రదాడి పై యావత్ భారతావని బగ్గు మంటుంది. పాక్ పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని భావిస్తుంది. పాకిస్థాన్ తో యుద్ధం చేయడం భారత్ కి పెద్ద సమస్య కాదు. కానీ ఇక్కడ ఆలోచిస్తున్నది చైనా గురించి. చైనా మనకంటే కొంచెం ముందు ఉంది.
ఒకవేళ పాకిస్థాన్ తో యుద్ధానికి భారతదేశం సై అంటే పాకిస్థాన్ ను రక్షించడానికి చైనా సిద్ధంగా ఉంది. అయితే చైనాను మనం ఎదుర్కొనలేమా అంటే ఎదుర్కోవచ్చు. కానీ ఇప్పుడు కాదు. దానికి కొంత సమయం పడుతుంది. భారత్ ఒక మిసైల్ తయారు చేస్తోంది. అది కనుక పూర్తి అయితే భారత్ అంటే చైనా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఆ మిసైల్ ఏంటో దాని కధ ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. అమెరికా శాస్త్రవేత్తలు రాసిన ఒక కథనం ఆసక్తికరంగా మారింది. భారత్ అణుశక్తి క్షిపణి వ్యవస్థ సామర్ధ్యానికి సంబంధించిన అణ్వాయుధ నిపుణులు కిసాన్ మరియు రాబర్ట్ లు ఇండియన్ న్యూక్లియర్ ఫోర్స్ 2017 పేరిట ఒక కథనాన్ని రాశారు.
భారత్ ఇదివరకులా లేదని, ప్రస్తుత తన ఆయుధ, అణ్వాయుధ సంపత్తిని ఆధునీకరించే పనిలో ఉందని ఈ కథనంలో పేర్కొంది. ఇంతక ముందు పాకిస్థాన్ ను దృష్టిలో ఉంచుకొని ఆయుధాలు మీద దృష్టి సారించింది. కానీ ప్రస్తుతం చైనాను దృష్టిలో ఉంచుకొని ఆయుధాలు మీద దృష్టి పెడుతుందని ఆ కథనంలో పేర్కొంది.