పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్‌ను భారత సైన్యం పేల్చేసింది…
పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్‌ను భారత సైన్యం పేల్చేసింది. ఇవాళ ఉదయం 6:30 గంటల సమయంలో గుజరాత్‌లోని కుచ్ బోర్డర్ వద్ద డ్రోన్‌ను పేల్చేశారు. నిఘా కోసం ఈ డ్రోన్‌ను పాకిస్థాన్ ఉపయోగించింది.
నలియా ఎయిర్ బేస్ క్యాంపు సమీపంలో డ్రోన్‌ను పసిగట్టిన భారత సైన్యం అప్రమత్తమై దాన్ని పేల్చేసింది.
ఈ నలియా ఎయిర్ బేస్ క్యాంపు అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గర్లో ఉంది.
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా బాలాకోట్, చకోటి, ముజఫరాబాద్‌లో జైషే ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం విరుచుకుపడ్డ విషయం తెలిసిందే.
సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద శిబిరాలపై వెయ్యి కిలోల బాంబులతో భీకరదాడి జరిపి ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది.
జైషే మహమ్మద్‌కు చెందిన ఆల్ఫా -3 నియంత్రణ కేంద్రాలను ధ్వంసం చేసింది.
ఇవాళ తెల్లవారుజామున 3:30 గంటలకు 12 మిరేజ్-2000 జెట్ ఫైటర్స్‌తో దాడి చేశారు. సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి జరిగిన 12 రోజుల తర్వాత దాడులు జరిగాయి