నిన్నటి పాకిస్థాన్ పై దాడులు సూపర్ హిట్ అవడానికి కారణం…
నిన్నటి పాకిస్థాన్ పై దాడులు సూపర్ హిట్ అవడానికి కారణం మొదటిది ఇండియన్ ఏయిర్ ఫోర్స్ కాగా, రెండవది మోది గారి ముందుచూపు. మొదటి నుండి మోది గారు ఒక పద్దతి ప్రకారం చేస్తుండటంతో ఈ అద్భుతం సాధ్యమైంది. అది ఏలాగో చూడండి
1) మోది ప్రభుత్వం వచ్చీరాగానే ఫైలెట్లందరికీ “Flying hours” ను మూడు రెట్లు పెంచారు. దీని వలన ఫైలెట్లకు మంచి శిక్షణ లభించింది. తద్వారా ఫైలెట్లు మెరికల్లాగ తయారయ్యారు.
2) మోది ప్రభుత్వ హయాంలొ త్రివిధ దళాల మిలటరీ ఏక్సరసైజ్ లకు అసలు లెక్కేలేదు. దాదాపుగా నిత్యం ఏదో ఒక మిలటరీ ఏక్సరసైజ్ చేస్తూనే ఉన్నారు. దీని వలన ఇండియన్ ఏయిర్ ఫొర్స్ గొప్ప అనుభవం గడించింది. కొత్త టెక్నిక్స్ నేర్చుకుంది
3) అన్నిటికంటే కీలకమైనది మిరేజ్ 2000. నిజానికివి 1980 కాలం నాటివి. అయితే మోది ప్రభుత్వం వచ్చిన తరువాత మరలా వీటిని ఆధునీకరించారు. ప్రస్తుత పరిస్తితులకు తగ్గట్టుగా వీటిని మార్చివేసారు. ఇది మనకు బాగా కలిసివచ్చింది.
4) సమయానికి ఆధునీకరించిన మిరేజ్ లు LoC వద్ద మొహరించి ఉన్నాయి. వీటిని ఆధునీకరించి ఉండటంతో ఆపరేషన్ ఏటువంటి ఆటంకం లేకుండా 100% విజయవంతమైంది. ఒక వేళ ఈ మిరేజ్ లు ఆధునీకరించకపోయినట్లయితే మరలా ఇబ్బందులు ఏదుర్కొవాల్సి వచ్చేది.
5) ఒక వేళ మిరేజ్ లను ఆధునీకరించకపోయినప్పటికీ మనకు సుఖోయ్ లు ఉన్నాయి. కాని సుఖోయ్ లు LoC దగ్గర మోహరించిలేవు. వాటిని మరలా LoC వద్ద కు తరలించినట్లయితే, పాకిస్థాన్ తేలికగా కనిపెట్టేసేది.
ఈ విధంగా మోది ప్రభుత్వం ఒక పద్దతి ప్రకారం, ప్యూహాత్మకంగా పోతుండటం వలన అంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్ గాని, ఇప్పుడు ఏయిర్ స్ట్రైక్స్ గాని ఏటువంటి ఆటంకం లేకుండా సాఫీగా సాగాయి ……