దాడులు చేసింది ఈ మిరేజ్ 2000 ఫైటర్ జెట్ ..

దాడులు చేసింది ఈ మిరేజ్ 2000 ఫైటర్ జెట్ ..
అంతా 21 నిమిషాల్లో ఫినిష్ ..

ఉగ్రవాదంపై పోరును భారత్‌ ఉద్ధృతం చేసింది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది. ఎల్‌ఓసీని దాటి భారత వాయుసేన పాక్‌ ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసింది. నిర్దేశిత లక్ష్యాలపై వంద శాతం విజయవంతంగా దాడులు చేపట్టింది. ఇందుకు అత్యాధునిక మిరాజ్‌ 2000 ఫైటర్‌ జెట్లను వినియోగించింది. మొత్తం మూడు ప్రాంతాల్లో ఇవి తమకు అప్పగించిన పనిని చాకచక్యంగా పూర్తి చేశాయి. దాడి మొత్తం 21 నిమిషాల్లోనే పూర్తయింది. వెయ్యి కిలోల పేలుడు పదార్థాలు ఉన్న లేజర్‌ గైడెడ్‌ బాంబులతో ఉగ్రక్యాంపులపై యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి.

* మొదటి దాడి మంగళవారం తెల్లవారుజామున 3.45 నిమిషాలకు ప్రారంభమైంది.

* పీఓకే రాజధాని‌ అయిన ముజఫరాబాద్‌కు 24 కిమీ దూరంలో బాలకోట్‌ ప్రాంతంపై 3.45 నుంచి 3.53 వరకూ బాంబుల వర్షం కురిపించింది. బాలకోట్‌ పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ప్రాంతం.

* బాలాకోట్‌లోని జైషే మహమ్మద్‌, లష్కరే, హిజ్బుల్‌ ఉగ్రవాద సంస్థల సంయక్త శిక్షణా శిబిరాల లక్ష్యంగా భారత్‌ ఈ దాడులు చేపట్టింది.

* మరో లక్ష్యం ముజఫరాబాద్‌ ప్రాంతంపై యుద్ధ విమానాలు 3.48 నిమిషాల నుంచి 3.55 మధ్య దాడులు చేపట్టాయి.

* చకోటి ప్రాంతంపై 3.58 నుంచి 4.04 వరకూ జెట్‌ ఫైటర్స్‌ బాంబుల వర్షం కురిపించాయి.

దాడులపై తొలుత పాకిస్థాన్‌ ఇంటర్‌ సర్వీసెన్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ డీజీ ఆసీప్‌ గఫూర్‌ స్పందించారు. మెరుపు దాడుల అనంతరం భారత సైన్యం సర్వసన్నద్ధమైంది. పాక్‌ నుంచి ఎదురయ్యే ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటించింది.

About The Author