వ్యవసాయం ప్రాధాన్యాన్ని ఇంకా పెంచుదాం…
వ్యవసాయం ప్రాధాన్యాన్ని ఇంకా పెంచుదాం
– సమిష్టిగా పనిచేసి శాఖ గౌరవం మరింత పెంచుదాం
– ఉద్యోగులతో ప్రేమగా పనితీసుకుందాం
– ఉద్యానశాఖ వ్యవసాయ శాఖతో పోటీపడి ఉద్యానపంటలను మరింత విస్తరించాలి
– సూక్ష్మసేద్యం యొక్క ప్రాధాన్యతను పెంచాలి. నీటివాడకం, అధిక దిగుబడులపై అవగాహన కల్పించాలి
– వరుసగా ప్రతి ఏటా ఒకటే పంటమూలంగా నేల సారం క్రమేపీ కోల్పోతుంది
– దీనికి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను నడిపించాలి
– ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన, పండ్ల ఎగుమతులపై దృష్టిసారించాలి
– రీసెర్చి సెంటర్లను బలోపేతం చేసుకుందాం
– మార్కెట్ యార్డులలో రైతులకు, కూలీలకు తాగునీరు, టాయిలెట్ల సౌకర్యం కల్పించాలి
– త్వరలోనే మరింత లోతుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సమీక్ష ఉంటుంది
– వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు