‘వైజాగ్ డివిజన్’ లేకుండా ‘ వైజాగ్ రైల్వే జోన్’ ఇవ్వడమేమిటి?
‘వైజాగ్ డివిజన్’ లేకుండా ‘ వైజాగ్ రైల్వే జోన్’ ఇవ్వడమేమిటి?
ఆంధ్రా వాళ్ళను ఎంత ఎగతాళి చెయ్యాలో, ఎంత హింసించాలో, ఎంత కష్ట పెట్టాలో….అంతా చేస్తున్నారు.
విజయవాడ, గుంటూరు గుంతకల్ డివిజన్ల తో …. వాల్తేర్ డివిజన్ లేకుండా , వైజాగ్ రైల్వే జోన్….!!
వాల్తేర్ డివిజన్ ను రెండుగా చేసి,కొత్తగా రాయగడ్ డివిజన్ ఏర్పాటు చేశారు. వాల్తేర్ డివిజన్ లో 2వంతులు రాయగఢ్ డివిజన్ కు ఇచ్చేసి 1వంతు మాత్రమే విశాఖ డివిజన్ కు కలిపారు.
పాసింజర్ రవాణా మాత్రమే కొత్త విశాఖ డివిజన్ లోకి తెచ్చారు.
సరకు రవాణా మొత్తం రాయగఢ్ డివిజన్ కే ఇచ్చారు. ప్రతి రూ.100 ఆదాయంలో రూ.70 రాయగఢ్ డివిజన్ కే పోతుంది.
వాల్టేర్ డివిజన్ కు సరుకు రవాణా కింద రూ.6,500కోట్లు వస్తుంది, పాసింజర్ రవాణా కింద రూ.500కోట్లు మాత్రమే వస్తుంది. సరుకు రవాణా రాయగడ్ కు కట్టబెట్టి విశాఖ జోన్ కు రూ.6,500కోట్లు రాబడి దూరం చేశారు.
ఇన్నాళ్లు ఇవ్వకుండా నాన్చి నాన్చి ఇప్పుడు ఇచ్చింది కూడా ప్రజలకు సంతృప్తి లేకుండా చేశారు.
ఇలా ఉన్నాయి పువ్వుల పంపకాలు…ఆంధ్రుడా మేలుకో.