యుద్ధం

ఒక అలవాటుతో, ఒక వ్యాధితో,ఒక సమస్యతో, ఒక వ్యక్తి తో, ఒక వ్యవస్థతో, ఒక వర్గం తో, ఒక రాజ్యం తో, ఒక దేశం తో

ఏ యుద్ధమైన అది యుద్ధమే
యుద్ధం చేసే వాడి భావోద్వేగాలను అంచనా వేయడం కష్టం
యుద్ధం లో జయాపజయములు విధి లిఖితములు ఎవరు గెలుస్తారో ఎవరు ఒడిపోతారో ఎవ్వరూ చెప్పలేరు కానీ,

యుద్ధోత్సహం ఉన్న వాడు యుద్ధం గెలిచే అవకాశాలే ఎక్కువ, ఇప్పుడు భారత్ యుద్ధోత్సహం తో నే ఉంది #అభినందన్ అనే వాయుసేన పైలెట్ పాకిస్థాన్ వాళ్లకు దొరికాడని ఒక్కడికి కాపాడటానికి శాశ్వతంగా యుద్ధ విరమణ చేయడం అనేది జరగదు, ఆర్మీ లో చేరిన ప్రతీ సైనికుడు చావుకు స్వాగతం చెప్పినట్టే, చావుకు సిద్ధపడ్డవాడే యుద్ధం లో నిలబడతాడు, ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఆలోచించాల్సింది పాకిస్థాన్ ని మళ్ళీ కొలుకోడానికి 100 సంవత్సరాలు పట్టేలా చావు దెబ్బ ఎలా కొట్టాలి అని కానీ పైలెట్ ని ఎలా విడిపించాలి అని కాదు,
మమతా బెనర్జీ బెంగాల్ లోని పాకిస్థానీ ఖైదీలను ప్రత్యేక జైల్ లలోకి మార్చింది, అంటే శత్రువుల ప్రాణాలు కూడా కాపాడటానికి మన దేశం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది, ఇదే మన బలహీనత కూడా, మన దేశానికి నైతిక విలువలు ఎక్కువ ఆ విషయం శత్రువులకు తెలుసు అందుకే సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంటూనే ఉంటారు

కానీ ఈ సారి భిన్నంగా ఆలోచించాల్సిన సమయం , ప్రాణ నష్టానికి, ఆస్తి నష్టానికి భయపడి వెనక్కి తగ్గితే మాటు వేసి ఇంకో 1000 మంది ఉగ్రవాదులను మన దేశం మీదకి పంపుతారు, ఇలాంటి సమయంలో మీడియా ఛానెల్స్ ని కంట్రోల్ చేసి పాకిస్థాన్ ఆర్మీ బలగాలను నామరూపాలు లేకుండా చేయడమే తక్షణ కర్తవ్యం
ఈ దేశం కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు అందులో అభినందన్ కూడా అమరుడవుతాడు కానీ శాశ్వత పరిష్కారం కి మార్గం అవుతాడు

యుద్ధాయ కృత నిశ్చయః

About The Author