నిత్యజీవితంలో పాటించవలసిన నియమాలు
నిత్యజీవితంలో పాటించవలసిన నియమాలు
. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు.
. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు.
భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి.
. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు.
తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది.
ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటపుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి.
. పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు. రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు.